Scindia With KCR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదిరిందా?

Scindia With KCR: దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లు పార్టీల్లో బంధాలు బలపడుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీ విషయంలో మెతకబడినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో దోస్తీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీ నేతలు ఆ పార్టీపై విమర్శలు చేసేందుకు సైతం వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ర్ట పర్యటనలో కూడా ఇబ్బందులు […]

Written By: Srinivas, Updated On : September 12, 2021 5:37 pm
Follow us on

Scindia With KCR: దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లు పార్టీల్లో బంధాలు బలపడుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీ విషయంలో మెతకబడినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో దోస్తీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీ నేతలు ఆ పార్టీపై విమర్శలు చేసేందుకు సైతం వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ర్ట పర్యటనలో కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలుస్తోంది.

జ్యోతిరాధిత్య సింధియా పర్యటన పూర్తయిన తరువాత సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇది రాజకీయ పర్యటన కాదని కేవలం మర్యాద పూర్వకంగానే తాను కేసీఆర్ ను కలిసినట్లు చెప్పుకొన్నారు. దీంతో పార్టీల్లో కూడా రోజురోజుకు మార్పులు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య నిజంగానే అవగాహన పెరిగిందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ చెబుతున్న సందర్భంలో రాజకీయంగా సవాళ్లు పెరుగుతున్నాయి. సింధియా కేసీఆర్ భేటీలో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రులు ప్రజాసంగ్రామ యాత్రలో కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు మాత్రం అంతగా ప్రచారం ఇవ్వకుండా అధికార భేటీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని నేతలే చెబుతున్నారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత నేతల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే విమర్శలకు తావివ్వకుండా సఖ్యత మంత్రాన్ని జపిస్తోన్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ర్టంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పడంలో సందేహాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు పచ్చిబూతులు తిట్టుకున్న నేతల్లో క్రమంగా మంచి మాటలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది.