https://oktelugu.com/

MAA Elections: ‘మా’ మసకబారడానికి కారణం వారే.. ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్

MAA Elections prakash Raj: తెలుగు సినిమా రంగం ఎన్నికలు కాకరేపుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జరుగనున్న ఈ ఎన్నికలు సినీ ప్రముఖుల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తున్నాయి. ‘మా’లో గెలుపు కోసం విందులు ఇస్తున్న వైనం ఈ మధ్యాహ్నం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆదివారం దాదాపు 100 మంది సీనీ కళాకారులతో ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రత్యేక భేటి […]

Written By: , Updated On : September 12, 2021 / 05:48 PM IST
Follow us on

MAA Elections prakash Raj: తెలుగు సినిమా రంగం ఎన్నికలు కాకరేపుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జరుగనున్న ఈ ఎన్నికలు సినీ ప్రముఖుల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తున్నాయి. ‘మా’లో గెలుపు కోసం విందులు ఇస్తున్న వైనం ఈ మధ్యాహ్నం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ స్పందించారు.

ఆదివారం దాదాపు 100 మంది సీనీ కళాకారులతో ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రత్యేక భేటి నిర్వహించింది. ‘మా’ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రకాష్ రాజ్ సభ్యులకు వివరించారు. సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

తన ప్యానెల్ గెలిస్తే ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకాష్ రాజ్ తెలుగు సినీ ప్రముఖులు, సభ్యులకు వివరించారు. అసోసియేషన్ లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరని..కొంత మంది హీరోలు సభ్యులుగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి ముందు రావడం లేదని ప్రకాష్ రాజ్ తెలిపారు.

కళాకారుల సంక్షేమం, పిల్లల విద్య, వైద్యంకోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. కేవలం 6 నెలల్లోనే తన పనితనాన్ని చూపిస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇక ‘మా’ మసకబారడానికి కొందరు మాత్రమే కారణం అంటూ ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ సహా ప్రత్యర్థి వర్గం, నరేశ్ పాలకవర్గాలను టార్గెట్ చేసి ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఆగస్టు నెలలో ‘మా’ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరూలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి నెలకొంది. ప్రకాష్ రాజ్ కు సపోర్టుగా ఉన్న బండ్ల గణేష్ ఆ ప్యానెల్ నుంచి వైదొలిగారు.