Schools Reopening: కొవిడ్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించిన సంగతి అందరికీ విదితమే. అయితే, విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకుగాను ఆన్ లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడు అనే దానిపైన అస్పష్టత నెలకొంది. కాగా, ఆ విషయమై తెలంగాణ విద్యా శాఖ స్పష్టతనిచ్చింది. వచ్చే నెల 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని తెలిపింది.

పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులకు హైకోర్టు సూచించింది. విద్యాసంస్థలు ఓపెన్ చేయాల్సిందే అని తల్లి దండ్రుల నుంచి కూడా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కరోనా నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తోంది. అయితే, ఇలా చేయడం ద్వారా సెలబస్ కవర్ అవుతుందని, కానీ, ప్రత్యక్ష బోధనకు ఆన్ లైన్ క్లాసెస్ ఆల్టర్నేట్ కాదని విద్యార్థుల తల్లి దండ్రులు చెప్తున్నారు.
Also Read: Schools Reopen: స్కూళ్ల రీఓపెన్ : ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచంటే?
ఈ క్రమంలోనే విద్యా సంస్థలు రీ ఓపెన్ అయిన తర్వాత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలన్నీ సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెనింగ్ పైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నది.
పాఠశాలలు స్టార్ట్ చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు కొన్ని, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా స్కూల్స్ రీ స్టార్ట్ చేయడంపైన డెసిషన్ తీసుకున్నాయని తెలుస్తోంది. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం.
Also Read: Schools Reopening: పాఠశాలల పున:ప్రారంభంపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న