Ravi Teja: 300 కోట్ల బిజినెస్ కి రవితేజకు 72 కోట్ల రెమ్యునరేషన్ !

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. క్రాక్ హిట్ తర్వాత ఏకంగా ఆరు సినిమాలతో జోరుమీదున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతోపాటు చిరంజీవి సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో రూ.300 కోట్ల బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్‌ లో నడుస్తోంది. ఇక ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల చొప్పున, […]

Written By: Raghava Rao Gara, Updated On : January 29, 2022 6:23 pm
Follow us on

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. క్రాక్ హిట్ తర్వాత ఏకంగా ఆరు సినిమాలతో జోరుమీదున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతోపాటు చిరంజీవి సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో రూ.300 కోట్ల బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్‌ లో నడుస్తోంది.

Ravi Teja

ఇక ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల చొప్పున, రూ.72 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే
రూ.300 కోట్ల బిజినెస్ కి. రూ.72 కోట్ల రెమ్యునరేషన్ అన్నమాట. ఏది ఏమైనా కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా వేషాలు వేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగి, నేడు ‘మాస్ మాహారాజా’గా నిలిచిపోయాడు రవితేజ. మాస్ మహారాజ్ అనే పేరు సంపాదించడానికి రవితేజకు ఎన్నో ఏళ్ళు పట్టింది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్‌ డమ్‌ సాధించడం అందరికీ సాధ్యమైయ్యే పని కాదు.

Also Read: మ‌ళ్లీ ర‌గులుకున్న మొగ‌లిపొద పెగాస‌స్ వ్య‌వ‌హారం

కెరీర్ మొదట్లో కర్తవ్యం , చైతన్య, ఆజ్ కా గూండా రాజ్’ లాంటి చిత్రాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఆ సమయంలోనే కృష్ణవంశీ తన ‘సింధూరం’ సినిమాలో రవితేజకు సెకండ్ హీరోగా మొదటి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘నీ కోసం’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు రవితేజ.

Ravi Teja

అయితే, పూరీ జగన్నాథ్ చేసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ ఇలా వరుస సూపర్ హిట్ చిత్రాలతో రవితేజకు స్టార్ హీరోల సరసన సగర్వమైన స్థానం లభించింది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో రవితేజ స్థాయి మరింత పెరిగింది.

Also Read: F3 షూటింగ్ జర్నీ పూర్తయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!

Tags