Schools Reopen In Telangana: నేటి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నేడు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ నుంచి మూతబడిన పాఠశాలలు నేటితో విద్యాసంవత్సరం ఆరంభించనున్నాయి. వేసవి సెలవుల తరువాత ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఇకపై బడిలో ఉండనున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు ఉచితంగానే సరఫరా చేస్తోంది. దీంతో వారు తమ చదువు కొనసాగించడానికి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. పేదవారైనా, ఉన్నవారైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి అందరికి సదుపాయాలు కల్పించడం సర్కారు విధి. అందుకే వారికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని సమకూరుస్తూ వారిని పాఠశాలలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేసే దుస్తుల తయారు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాంలు అందించేందుకు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్న నేపథ్యంలో పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో సర్కారు లక్ష్యం ముందుకు సాగుతుందో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. కానీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు త్వరలో అందజేస్తామని చెబుతున్నారు.
Also Read: KCR National Party: కేసీఆర్ మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం: జాతీయ పార్టీ నినాదం ఇదే..
రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులున్నట్లు చెబుతున్నారు. వీరికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. అందుకే సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లున్నాయి. ఇందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 80 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా సోమవారం నుంచి బడులకు వెళ్తున్నారు. విద్యాబోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యారు.

ప్రభుత్వం ఇప్పటికే బడిబాట కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. అవగాహన కూడా కల్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులను పాఠశాలలకు తీసుకొచ్చే కార్యక్రమాల కోసం చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి సర్కారు తన మనుగడ కొనసాగిస్తుందా? ప్రైవేటు పాఠశాలల ధాటికి కుదేలైపోతాయా అనేది తేలాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్చుకుంటూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రభావం చూపుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఏం కట్టుబాట్లు తీసుకుంటుందో తెలియడం లేదు.
Also Read:Khammam District Politics: ఖమ్మంలో రసవత్తర రాజకీయం