Mohanlal: మలయాళం సినిమా ఇండస్ట్రీ లో తిరుగులేని నెంబర్ 1 హీరో స్థానం లో కొనసాగుతున్న వ్యక్తి మోహన్ లాల్..ఈయన కేవలం ఒక్క మలయాళం సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాదు..తెలుగు , హిందీ , కన్నడ బాషలలో కూడా ఇది వరుకు ఆయన నటించాడు..ఇప్పటి వరుకు ఆయన అన్ని భాషలకు కలిపి దాదాపుగా 400 సినిమాలకు పైగా చేసాడట..సినీ కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ మరియు పద్మ భూషణ్ అవార్డులతో కూడా సత్కరించింది..సుమారు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో ఒక్క రీమార్క్ కూడా లేకుండా ఉన్న మోహన్ లాల్ ని ఇప్పుడు ఒక్క సమస్య వెంటాడుతుంది..గతం లో మోహన్ లాల్ ఇంటి పై IT అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి మన అందరికి తెలిసిందే..సుదీర్ఘంగా రెండు రోజుల పాటు జరిపిన ఈ విచారణలో మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలు దొరకడం అప్పట్లో పెద్ద కలకాలమే రేపింది..నేషనల్ మీడియా కూడా దీని పై అప్పట్లో కవరేజి ఇచ్చింది..కానీ IT అధికారులు మాత్రం మోహన్ లాల్ పై ఎలాంటి ఫిర్యాదు చెయ్యకుండా వదిలేసింది.
Also Read: Nani Hikes Remuneration: నాని షాకింగ్ రెమ్యునరేషన్… ఇప్పుడిదే హాట్ టాపిక్, అంత పెంచేశాడు!
సాధారణంగా ఏనుగు దంతాలు ఒక్కరి ఇంట్లో పదిలపరచడం చట్టరిత్యా చాలా పెద్ద నేరం..దీనికి చట్టం ప్రకారం 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది..IT అధికారులు ఈ అంశం ని తేలికగా తీసుకున్నప్పటికీ..అటవీశాఅఖ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని మోహన్ లాల్ పై పోలీస్ కేసు పెట్టారు..గతం లో ఈ కేసు విచారణ కి థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదు అని ట్రయిల్ కోర్టు విచారణకి నిరాకరించింది హై కోర్ట్..అయితే ఇప్పుడు ప్రజాప్రయోజనాలు వ్యాఖ్యలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పిటిషన్ ని దాఖలు చెయ్యడం తో కేరళ హై కోర్టు వారి వాదనని వినడానికి అనుమతిని ఇచ్చింది..దీనితో మళ్ళీ ఈ కేసు తలనొప్పి మోహన్ లాల్ కి పట్టుకుంది..ఈ కేసు లో తమ అభిమాన హీరో కి జైలు శిక్ష పడితే తట్టుకోలేము అని మోహన్ లాల్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా కంటతడి పెడుతున్నారు..ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన మరక్కార్ అనే సినిమాని విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఆ తర్వాత మోహన్ లాల్ నటించిన బ్రో డాడీ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది..ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి..ఇందులో రెండు సినిమాలు షూటింగ్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో ఉండగా..మరో మూడు సినిమాలు చిత్రీకరణ స్థాయిలో ఉన్నాయి..ఇలాంటి సమయం లో మోహన్ లాల్ జైలు కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉండడం తో ఆయన నిర్మాతలు కంగారు పడుతున్నారు.