ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం

కొవిడ్ ప్రభావంతో పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 16నుంచి పాఠశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. దీంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఒక పక్క మూడో దశ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పాఠశాలల ప్రారంభానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : July 7, 2021 5:37 pm
Follow us on

కొవిడ్ ప్రభావంతో పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 16నుంచి పాఠశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. దీంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఒక పక్క మూడో దశ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పాఠశాలల ప్రారంభానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు లోపు విద్యాసంస్థల్లోనాడు నేడు పెండింగ్ పనుల పూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉఫాధ్యాయులకు శిక్షణ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సుేష్ తెలిపారు.
పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందన్నారు. దీంతో పాఠశాలలు మూతపడవని వివరించారు. ఉపాధ్యాయుల పోస్టులు తగ్గవని సూచించారు. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మిస్తామన్నారు.
ఇంటర్ విద్యార్థులకు 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు కలుపుతామన్నారు. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యాసంవత్సరం జాప్యం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.