https://oktelugu.com/

కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ

కేంద్ర కేబినెట్ పునర్యవ్యవస్థీకరణపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆశావహుల్లో ఇప్పటికే సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. మరికొన్ని గంటల్లోనే కేబినెట్ విస్తరణ జరగనుండడంతో ఇప్పటికే అందరు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కొందరిని శాఖల నుంచి తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తన పదవికి రాజీనామా చేశారు. సుమారు 10 మంది మంత్రులు తమ శాఖల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. వీరిలో రమేశ్ పోబ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానంద గౌడ, రతన్ లాల్ కటారియా, […]

Written By: , Updated On : July 7, 2021 / 05:47 PM IST
Follow us on

PM Modiకేంద్ర కేబినెట్ పునర్యవ్యవస్థీకరణపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆశావహుల్లో ఇప్పటికే సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. మరికొన్ని గంటల్లోనే కేబినెట్ విస్తరణ జరగనుండడంతో ఇప్పటికే అందరు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కొందరిని శాఖల నుంచి తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తన పదవికి రాజీనామా చేశారు. సుమారు 10 మంది మంత్రులు తమ శాఖల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.

వీరిలో రమేశ్ పోబ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానంద గౌడ, రతన్ లాల్ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్ దోత్రే, రావు సాహెబ్ దన్వే పాటిల్, అశ్వినీ చౌబే, బాబుల్ సుప్రియో ఉన్నారు. కరోనా నేపథ్యంలోచోటు చేసుకున్న పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ను మార్చాలని భావించించి. అనుకున్నదే తడవుగా ఆయన పదవిని తప్పించేందుకు నిర్ణయించుకున్నారు.

దీంతో ఆరోగ్య శాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై సస్పెన్స్ కొససాగుతోంది. అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ పోబ్రియాల్ తెలిపారు. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో 43 మంది ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆహ్వానం అందిన నేతలు మోడీ నివాసానికి చేరుకున్నారు.

ప్రధాని నివాసానికి చేరుకున్న వారిలో జ్యోతిరాదిత్య సింధియా, సర్వానంద సోనోవాల్, నారాయణ్ రాణె, భూపేంద్ర యాదవ్, ఆర్పీ సింగ్, అనుప్రియ పటేల్, పశుపతి కుమార్ షరాన్, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, కిషన్ రెడ్డి, కపిల్ పాటిల్, మీనాక్షి లేఖి, రాహుల్ కాస్వా, అశ్వినీ వైష్ణవ్, శాంతను ఠాకూర్, వినోద్ సోంకర్, పంకజ్ చౌదరి, దిలేశ్వర్ కామత్, చందేశ్వర్ ప్రసాద్, రామ్ నాథ్ ఠాకూర్, రాజ్ కుమార్ రంజన్ సింగ్, అజయ్ మిశ్రా, బీఎల్ శర్మ, అజయ్ భట్, శోభా కరంద్లాజే తదితరులు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటలకు జరిగే కార్యక్రమంలో మంత్రివర్గ విస్తరణ చేపడతారని తెలుస్తోంది.