
ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీలో స్కూళ్లు, కాలేజీలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. అన్‌లాక్ 4.0లో భాగంగా 9 నుంచి 12వ తరగతి వరకు క్లాసుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారమే ఏపీలో సోమవారం తరగతి గదులు ఓపెన్ అయ్యాయి. స్కూల్స్ నిర్వాహకులు కరోనా రూల్స్ పాటిస్తూ క్లాస్‌లు నిర్వహించారు.
ఫిజికల్ డిస్టెన్స్‌తో పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా నిబంధన అమలు చేశారు. అలాగే.. విద్యార్థులు స్కూల్‌లోకి అడుగుపెట్టగానే శానిటైజేషన్ చేయించారు. అయితే.. చాలా మంది విద్యార్థులను తమ తల్లిండ్రులు స్కూళ్లకు పంపించలేదు. కంటైన్‌మెంట్ జోన్లలోని విద్యామందిరాలు తప్ప మిగితావన్నీ తెరుచుకున్నాయి.
Also Read : ఏపీ ప్రభుత్వం సంచలనం.. దమ్మాలపాటిపై సుప్రీంకు..
కేంద్రం ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాల్లో.. విద్యార్థులు స్కూల్‌కి వెళ్లడమా.. లేదా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. ఒకవేళ పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటే ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వినొచ్చని సూచించింది. స్కూల్ గదులను, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటుగా, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది అందరూ ఫిజికల్ పాటిస్తూ తరగతులను నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా దూరందూరంగా కూల్చోవాల్సి ఉంటుంది.ఎప్పటికప్పుడు శానిటైజేషన్ కూడా చేయాలి.
కాగా… టీచర్లు కూడా రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది. కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజరయ్యేందుకు కూడా అధికారులు పర్మిషన్ ఇచ్చారు. విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇకపోతే ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్న స్టూడెంట్స్‌పైనా టీచర్లు దృష్టి సారించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు టీచర్లకు రెండు టాస్క్‌లు నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అటు స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు బోధించడం.. మరోవైపు ఆన్‌లైన్‌లో చదువుకునే వారిని పర్యవేక్షించడం.
Also Read : అన్నదాతలకు తీపికబురు చెప్పిన మోడీ సర్కార్