Homeజాతీయ వార్తలుRajya Sabha by-elections : రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌.. దేశ వ్యాప్తంగా 12 స్థానాలకు...

Rajya Sabha by-elections : రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌.. దేశ వ్యాప్తంగా 12 స్థానాలకు ఎలక్షన్స్‌.. తెలంగాణలో ఒక స్థానం..

Rajya Sabha by-elections : దేశంలో పెద్దల సభలో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల నగారా మోగింది. సభ్యుల రాజీనామా కారణంగా ఖాళీ అయిన 12 స్థానాలకు  కేంద్ర ఎన్నికల సంఘం.. బుధవారం(ఆగస్టు 7న) షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఈ స్థానాలకు సెప్టెంబర్‌ 3 వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఇందులో తెలంగాణ నుంచి కూడా ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్‌ నేత కే కేశవరావు.. రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఉపఎన్నిక జరగనుంది. 9 రాష్ట్రాల్లోని 12 స్థానాలకు సెప్టెంబర్‌ 3 వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు తెలిపింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
10 మంది లోక్‌సభకు ఎన్నిక..
రాజ్యసభ సభ్యులుగా ఉన్న 10 మంది ఎంపీలు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరికి తోడు తెలంగాణలో రాజ్యసభ ఎంపీగా ఉన్న కే కేశవరావు.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి మారడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఒడిశాకు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేయడంతో మొత్తం ఖాళీల సంఖ్య 12 కు చేరింది.
రాష్ట్రాల వారీగా ఖాళీ స్థానాలు..
అసోం, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. వీరు ఇటీవల లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి.
ఆగస్టు 14న నోటిఫికేషన్‌..
దేశంలోని 12 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు ఆగస్టు 14న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామనీ ఈసీ ప్రకటించింది. ఆగస్టు 21 వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఆగస్టు 26 వ తేదీలోపు.. బీహార్, హర్యానా, రాజస్థాన్‌ ఒడిశా తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఆగస్టు 27 వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
తెలంగాణలో ఇదీ పరిస్థితి..
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగిన రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకు ముందే ఆయన కూతురు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి బీఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరారు. కానీ, ఆమె తన పదవికి రాజీనామా చేయలేదు. సీనియర్‌ నేత కే.కేశవరావు మాత్రం తన పదవి వీడారు. దీంతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 27వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది.
11 ఎన్డీఏ కూటమికే.. 
ప్రస్తుతం ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించే 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలు అధికార ఎన్డీఏ కూటమే గెలుచుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ఒక సీటు మాత్రం కాంగ్రెస్‌ గెలిచే ఛాన్స్‌ ఉంది. ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఒడిశాలో ఎన్నికలు జరిగే 11 స్థానాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఖాతాలో పడనున్నాయి. అన్ని రాస్ట్రాల్లో ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version