రేపటి నుంచి పూరీ రథయాత్ర.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఎన్నో శతబ్ధాలుగా పూరి రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతీయేటా నిర్వహించే పూరి జగన్మాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 23నుంచి రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్డు ఈనెల 18న పూరి జగన్నాథ్ […]

Written By: Neelambaram, Updated On : June 22, 2020 6:18 pm
Follow us on


ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఎన్నో శతబ్ధాలుగా పూరి రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతీయేటా నిర్వహించే పూరి జగన్మాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 23నుంచి రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్డు ఈనెల 18న పూరి జగన్నాథ్ రథయాత్ర నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

సుప్రీం తీర్పుపై దేశంలోని పలు హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై కేంద్రం, ఒడిశా ప్రభుత్వం మరోసారి తీర్పును పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై సుప్రీం త్రిసభ్య ధర్మాసనాన్ని సోమవారం ఏర్పాటు చేసి విచారించింది. అంతకముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రథయాత్రలో ప్రజలు పాల్గొనకుండా నిర్వహిస్తామని న్యాయస్థానానికి హామీ ఇచ్చాయి. ఒకసారి రథయాత్ర ఆపితే 12ఏళ్ల వరకు నిర్వహించరాదనే ఆచారం ఉందని కోర్టుకు విన్నవించాయి.

ఎన్నో శతాబ్దాలుగా పూరీలో దేవదేవుడి రథయాత్ర కొనసాగుతోందని వివరించారు. కరోనా కారణంగా రథయాత్రను ఆపడం సరికాదని న్యాయస్థానానికి ప్రభుత్వం విన్నవించింది. ఇది కోట్లాది మంది విశ్వాసానికి, మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలు రథయాత్రలో పాల్గొనకుండా నిర్వహిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఆలయ పూజారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాకే రథయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని చెప్పాయి.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

రథయాత్ర నిర్వహించేందుకు తమకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో ధర్మాసనం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున రథయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. రథ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. దీంతో సుప్రీంకోర్టు పూరీ జగన్నాథ్ రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈమేరకు న్యాయస్థానం సూచనల మేరకు రేపు సాయంత్రం పూరీ జగన్నాథ్ ప్రారంభం కానుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పూరీ రథయాత్ర ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తగు ప్రణాళికలను రూపొందించారు. ఇదిలా ఉంటే భక్తుల్లేకుండా రథయాత్ర ప్రభుత్వం ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.