https://oktelugu.com/

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనతోపాటు మరో 19మంది అమరులయ్యారు. భారత జవాన్ల మృతిపట్ల యావత్ భారత్ నివాళి అర్పించిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సూర్యాపేట జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి విద్యానగర్లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లి సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 22, 2020 6:15 pm
    Follow us on


    భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనతోపాటు మరో 19మంది అమరులయ్యారు. భారత జవాన్ల మృతిపట్ల యావత్ భారత్ నివాళి అర్పించిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సూర్యాపేట జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి విద్యానగర్లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లి సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.

    తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

    ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ చిత్రపటానికి పూలమాలతో నివాళ్లర్పించారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాసేపు సంతోష్ బాబు పిల్లలతో ముచ్చటించారు. అనంతరం సంతోష్ బాబుకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ప్రకటించిన ఐదు కోట్ల రూపాయాల భారీ సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు

    సంతోష్ బాబుకు పిల్లల పేరిట 4కోట్ల చెక్కును ఆయన భార్య సంతోషికి అందించారు. అదేవిధంగా కేబీఆర్ పార్క్ సమీపంలో 711గజాల భూమికి సంబంధించిన పత్రాలు, గ్రూప్-1 ర్యాంకు స్థాయి ఉద్యోగానికి సంబంధించిన నియమక పత్రాన్ని సీఎం కేసీఆర్ అందించారు. అదేవిధంగా సంతోష్ బాబు తల్లిదండ్రుల పేరిట ఒక కోటి రూపాయాల చెక్కును అందించారు. డబ్బుల విషయంలో కుటుంబంలో గొడవలు జరుగకుండా ఆయన ముందుచూపుతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది కేసీఆర్ ముందుచూపు నిదర్శనంగా తెలుస్తోంది.

    మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

    అనంతరం సంతోష్ బాబు భార్య సంతోషి, తల్లిదండ్రులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎలాంటి సాయం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని వారు తెలిపారు. సంతోష్ బాబుతోపాటు అమరులైన కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం అందజేస్తాయని సీఎం తెలిపారని చెప్పారు. అదేవిధంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా తమ కుటుంబానికి అన్నివిధలా సహాయసహకారాలు అందిస్తున్నారని చెప్పారు.

    వీరజవాను మృతిపట్ల కేసీఆర్ సక్రమంగా వ్యవహరించలేదని గతంలో వచ్చిన విమర్శలకు సీఎం కేసీఆర్ నేడు చెక్ పెట్టినట్లయింది. ఏదిఏమైనా తెలంగాణ ప్రభుత్వం అందించిన భారీసాయం పట్ల సంతోష్ కుటుంబ సభ్యులను ఆదుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

    Tags