అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

పాత ప్రత్యర్థులు వారు.. పచ్చగడ్డి వేసినా వేయకున్నా భగ్గుమంటది. అలాంటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య యుద్ధం మొదలైంది. వైఎస్ జగన్ గద్దెనెక్కిన ఏడాది తర్వాత వేట మొదలుపెట్టారు. అవినీతిలో దొరికిన టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను జైలుకు పంపారు. వాట్ నెక్ట్స్ అని అనుకుంటున్న సమయంలోనే టీడీపీ సీనియర్లు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలు చిక్కారు. వారి చుట్టూ ఎస్సీ ఎస్టీ కేసులు బిగుసుకుంటున్న వేళ హైకోర్టుకెక్కిన టీడీపీ […]

Written By: NARESH, Updated On : June 22, 2020 6:24 pm
Follow us on


పాత ప్రత్యర్థులు వారు.. పచ్చగడ్డి వేసినా వేయకున్నా భగ్గుమంటది. అలాంటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య యుద్ధం మొదలైంది. వైఎస్ జగన్ గద్దెనెక్కిన ఏడాది తర్వాత వేట మొదలుపెట్టారు. అవినీతిలో దొరికిన టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను జైలుకు పంపారు. వాట్ నెక్ట్స్ అని అనుకుంటున్న సమయంలోనే టీడీపీ సీనియర్లు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలు చిక్కారు. వారి చుట్టూ ఎస్సీ ఎస్టీ కేసులు బిగుసుకుంటున్న వేళ హైకోర్టుకెక్కిన టీడీపీ సీఎం జగన్ కు షాకిచ్చింది.

తాజాగా టీడీపీ నేతలు ముగ్గురు అయ్యన్న, యనమల, నిమ్మకాయలపై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల్లో అరెస్ట్ ముంగిట హైకోర్టు ఊరటనిచ్చింది. వారికి బెయిల్ మంజూరు చేసింది.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై ఏపీ హైకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. తనపై పెట్టిన నిర్భయ కేసు కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది.

నర్సిపట్నం మున్సిపల్ కమిషనర్ ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయ్యన్నపై నమోదైన ఈ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

మరో వైపు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు , నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపైనా హైకోర్టులో విచారణ జరిగింది. వారిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు.

టీడీపీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై ఇటీవలే ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై కేసు నమోదైంది. తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరు టీడీపీ నేతల అరెస్ట్ కు రంగం సిద్ధమైన వేళ హైకోర్టులో యనమల, నిమ్మకాలయకు ఊరట లభించింది.