జగన్‌ సర్కార్‌‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

విజయవాడలోని ప్రైవేట్ కోవిడ్19 సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదం జరిగి పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఏపీలో సంచలనం రేపిన ఈ కేసులో సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వానికి పర్మిషన్‌ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న రమేశ్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ రమేశ్‌ బాబును నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేపట్టవచ్చని సూచించింది. రమేశ్‌ కూడా దర్యాప్తునకు సహకరించాలని […]

Written By: NARESH, Updated On : September 15, 2020 11:35 am
Follow us on

విజయవాడలోని ప్రైవేట్ కోవిడ్19 సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదం జరిగి పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఏపీలో సంచలనం రేపిన ఈ కేసులో సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వానికి పర్మిషన్‌ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న రమేశ్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ రమేశ్‌ బాబును నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేపట్టవచ్చని సూచించింది. రమేశ్‌ కూడా దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది.
Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు

డాక్టర్ రమేశ్‌ క్వాష్ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ రమేశ్‌ పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వర్ణ ప్యాలెస్‌లో క్వారంటైన్‌ సెంటర్‌‌ కోసం అనుమతిచిచిన కలెక్టర్‌‌, సబ్‌కలెక్టర్‌‌, డీఎంహెచ్‌వోలను ఇందులో ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రశ్నించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో జగన్ సర్కార్ హైకోర్టు ఉత్వర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ ఘటనలో పది మంది చనిపోగా.. 20 మంది వరకు గాయపడ్డారు. చనిపోయిన మృతులకు జగన్‌ సర్కార్‌‌ వెంటనే కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అప్పటి నుంచి సీరియస్‌గానే ఈ కేసును విచారణ చేపడుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురని ప్రశ్నించారు కూడా. అప్పటి నుంచి రమేశ్‌ బాబు కనిపించకుండా పోవడం.. హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జగన్‌ సర్కార్‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం తాజా తీర్పుతో జగన్‌ సర్కార్‌‌కు ఊరట లభించినట్లయింది. ఇక రమేశ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలూ వెలుగులోకి రానున్నాయి.

Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?