పాకిస్తాన్ కు సౌదీ షాక్‌..భారత్ కు దీపావళి గిఫ్ట్

పాకిస్థాన్‌ ఒక్క ఇండియాకే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకూ శత్రుదేశంలా తయారవుతోంది. రోజురోజుకూ ఆ దేశం చేపడుతున్న పిచ్చి చర్యలకు అందరిలోనూ నెగెటివ్‌ సెన్స్‌ పెరుగుతోంది. తాజాగా.. సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. పాక్ మ్యాప్‌ నుంచి పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్‌), గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ను తొలగించింది. నవంబర్‌లో సౌదీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే. Also Read: అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా? జీ-20 సమావేశాలను […]

Written By: NARESH, Updated On : October 29, 2020 11:24 am
Follow us on

పాకిస్థాన్‌ ఒక్క ఇండియాకే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకూ శత్రుదేశంలా తయారవుతోంది. రోజురోజుకూ ఆ దేశం చేపడుతున్న పిచ్చి చర్యలకు అందరిలోనూ నెగెటివ్‌ సెన్స్‌ పెరుగుతోంది. తాజాగా.. సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. పాక్ మ్యాప్‌ నుంచి పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్‌), గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ను తొలగించింది. నవంబర్‌లో సౌదీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే.

Also Read: అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా?

జీ-20 సమావేశాలను పురస్కరించుకొని సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన ఓ నోటును విడుదల చేసింది. ఆ నోట్‌ వెనకాల జీ 20 దేశాల మ్యాపులను ముద్రించారు. వాటిలో పాక్ మ్యాపులో కశ్మీర్‌తోపాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలను తొలగించారు. సౌదీ ప్రభుత్వం విడుదల చేసిన నోటులోని మ్యాప్‌లో పీవోకేతో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయంపై పీవోకేలో కొంత మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

‘సౌదీ అరేబియా ప్రభుత్వం భారత్‌కు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. పాకిస్థాన్ మ్యాప్ నుంచి పీవోకే, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాలను తొలగించింది’ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ యాక్టివిస్ట్ అంజాద్ ఆయుబ్ మీర్జా ట్వీట్ చేశారు. అయితే.. పాక్ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు నోరు మెదపలేదు.

Also Read: అప్పటివరకు స్కూళ్లు తెరవొద్దు.. కేంద్రం ఆదేశం

వచ్చేనెల 21,22న రియాద్‌ వేదికగా జీ20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు సౌదీ అరేబియా ప్రభుత్వం, ప్రిన్స్ సల్మాన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాలకు గుర్తుగా అక్టోబర్ 24న సౌదీ ప్రభుత్వం ‘20 రియాల్స్’ బ్యాంక్ నోటును విడుదల చేసింది. ఆ నోటు ముందు భాగంలో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫొటోను ముద్రించారు. దాని కింద ఓ నినాదం చేర్చారు. రెండో వైపున ప్రపంచపటం ముద్రించి, అందులో జీ-20 దేశాలను ప్రత్యేక రంగుల్లో చూపించారు. భారత్‌లో నరేంద్ర మోడీ పీఎం అయ్యాక సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ తదితర దేశాలతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. సౌదీ ప్రిన్స్ సల్మాన్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని భారత్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పాక్ ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేసినా.. కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేకాదు, పలు అంతర్జాతీయ అంశాల్లోనూ భారత్‌కు మద్దతు పలుకుతూ పాక్‌కు షాకిస్తోంది. అయితే.. సౌదీ ప్రభుత్వం దారిలోనే ఇతర అరబ్‌ కంట్రీస్‌ కూడా భారత్‌కు సానుకూలంగా వ్యవహరిస్తుండడం కీలక పరిణామం అనే చెప్పాలి.