https://oktelugu.com/

షాకిచ్చిన పునర్నవి.. ఇలా చేస్తుందని అనుకోలేదు.!  

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన పునర్నవి భూపాలం తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత పునర్నవి మరికొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ షో 3వ సీజన్‌లో రాహుల్‌తో లవ్ ట్రాక్‌తో పునర్నవి పాపులర్ అయింది. ఆ షోలో టాస్కులు పెద్దగా ఆడకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకుంది. Also Read: దయచేసి పార్టీ అడగొద్దంటున్న కాజల్ బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పూర్తయ్యాక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 10:33 AM IST
    Follow us on

    ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన పునర్నవి భూపాలం తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత పునర్నవి మరికొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ షో 3వ సీజన్‌లో రాహుల్‌తో లవ్ ట్రాక్‌తో పునర్నవి పాపులర్ అయింది. ఆ షోలో టాస్కులు పెద్దగా ఆడకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకుంది.

    Also Read: దయచేసి పార్టీ అడగొద్దంటున్న కాజల్

    బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పూర్తయ్యాక రాహుల్‌తో కలిసి పునర్నవి ఇంటర్వ్యూలు ఇచ్చింది. రాహుల్, పునర్నవి అభిమానులు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. తనకు పెళ్లి ఫిక్స్ అయిందని బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి చెప్పకనే చెప్పేసింది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో పునర్నవికి చాలాకాలం నుంచి పరిచయం ఉందని తెలుస్తోంది. అయితే వరుడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను చూపిస్తూ ‘మొత్తానికి జరిగిపోయింది’ అనే క్యాప్షన్ తో ఫొటోను షేర్ చేసింది.

    దీంతో కొందరు ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పగా.. మరికొందరేమో ‘నిజమేనా మేడమ్‌.. ఇది నిజంగా ఎంగేజ్‌మెంట్‌ రింగేనా..? వర్క్‌ ప్రమోషన్‌ కోసం చేస్తున్నారా..? ఇంతకీ ఎవరు మిమ్మల్ని పెళ్లాడబోయే వ్యక్తి’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. పలువురు ఫ్రెండ్స్‌ అడిగిన ప్రశ్నలకు కూడా అక్టోబర్‌‌ 30 వరకు వేచి ఉండు అని పునర్నవి సమాధానమిచ్చింది.

    Also Read: మనాలిలో నాగార్జున.. ఈ వారం బిగ్ బాస్ హోస్ట్‌ ఎవరు..?

    అయితే మరికొందరు మాత్రం వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పునర్నవి ఫొటోను షేర్ చేసిందని ఎంగేజ్ మెంట్ రింగ్ ద్వారా వెబ్ సిరీస్‌పై అంచనాలు పెంచాలని పునర్నవి భావిస్తోందని చెబుతున్నారు. పునర్నవి బ్లాక్ హార్ట్ ఎమోజీని పోస్టులో పెట్టడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి.అయితే పునర్నవి అధికారికంగా ప్రకటిస్తేనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.