https://oktelugu.com/

తమిళనాట.. రెండాకుల పంచాయితీ..

సరిగ్గా ఎన్నికల సమయంలో తమిళనాట అన్నా డీఎంకేకు భారీ దెబ్బే తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీ విజయం సాధించడం అంతంత మాత్రమే కాగా.. అన్నా డీఎంకేకు కొత్తకష్టం వచ్చింది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి రీ యంట్రీ ఇచ్చిన శశికళ చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. జయలలిత పార్టీ తనదే అంటున్నారు. అన్నాడీఎంకేను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఎంకేకు రెండాకుల గుర్తు చాలా కీలకం.. దానికోస మరోసారి శశికళ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 14, 2021 / 09:53 AM IST
    Follow us on


    సరిగ్గా ఎన్నికల సమయంలో తమిళనాట అన్నా డీఎంకేకు భారీ దెబ్బే తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీ విజయం సాధించడం అంతంత మాత్రమే కాగా.. అన్నా డీఎంకేకు కొత్తకష్టం వచ్చింది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి రీ యంట్రీ ఇచ్చిన శశికళ చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. జయలలిత పార్టీ తనదే అంటున్నారు. అన్నాడీఎంకేను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఎంకేకు రెండాకుల గుర్తు చాలా కీలకం.. దానికోస మరోసారి శశికళ న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.

    Also Read: అయోధ్య ఆలయానికి కళ్లు చెదిరే విరాళాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

    జయలలిత చనిపోయిన వారుత అన్నాడీఎంకేకు శశికళ ప్రధాన కార్యదర్శిగా నియమకం అయ్యారు. 2017లో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. దీంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అన్నాడీఎంకేను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఎదుట దినకరన్ వర్గం, పళనిస్వామి వర్గం గుర్తుకోసం తమ వాదనలు వినిపించారు. చివరకు పళనిస్వామి వర్గానికే అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది.

    Also Read: భారత్‌లో ప్రై‘వేటు’కు ద్వారాలు

    త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శశికళ తన నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆమె దృష్టి అంతా అన్నాడీఎంకే పైననే. ముందుగా రెండాకుల గుర్తుకోసం న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను అక్రమంగా తొలగించారని శశికళ వాదనలు వినిపించనున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఎన్నికల వేళ గుర్తకోసం మరోసారి న్యాయపోరాటం అధికార అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఎన్నికలకు అన్నాడీఎంకే సమాయత్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో గుర్తుకోసం పోటీపడడం పార్టీకి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం న్యాయ నిపుణులతో సమీక్షించినట్లు తెలిసింది. గుర్తు కేటాయింపులో ఏమాత్రం తేడా వచ్చినా.. ఇక పళనిస్వామి, పన్నీరు సెల్వంల రాజకీయ చరిత్ర ముగిసినట్లే. మొత్తం మీద శిశికళ రాకతో ఉహించని తలనొప్పులు అన్నాడీఎంకేకు ఇబ్బందికరంగా మారాయి.