Haibotupalli Sarpanch: మనిషి బతికున్నప్పుడు విలాసవంతమైన భవనంలో జీవించొచ్చు… ఎకరాల కొద్ది ఉన్న ఫాం హౌస్ లో ఎంజాయ్ చేయొచ్చ.. కానీ చనిపోయినప్పుడు ఖననం చేయడానికి ఆరడగుల స్థలం మాత్రమే.. నేటి కాలంలో ఆ స్థలం కూడా దొరకని పరిస్థితి. చాలా చోట్ల మనిషి దహన సంస్కారాలకు స్థలం దొరకకపోవడంతో మిషన్ల ద్వారా దహన సంస్కారాలు చేస్తున్నారు. ఇది సాంప్రదాయానికి విరుద్దమని భావించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠథామాల నిర్మిస్తోంది. రాష్ట్రంలో దిక్కులేని చావులు ఉండకూడదనే ఉద్దేశంతో వీటి నిర్మాణాలకు చొరవ చూపింది. పేద, ధనిక అని తేడా లేకుండా ఇందులో ఖననం చేసేందుకు అవకాశం ఇచ్చింది.
ఇందులో భాగంగా ఓ గ్రామంలో సర్పంచ్ అక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ శ్మశాన వాటిక(వైకుంఠ ధామం)ను కట్టించారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దీనిని పూర్తి చేయడానికి చొరవ చూపారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనిని ప్రారంభించలేదు. ఇటీవల ఆ సర్పంచ్ మరణించాడు. దురదృష్టవశాత్తూ తాను కట్టించిన శ్మశాన వాటిక తన మృతదేహంతోనే ప్రారంభం అయింది. హనుమకొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు..
హనుమకొండ జిల్లా.. పరకాల మండలంలోని హైబోతుపల్లి గ్రామం. ఈ గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామికి సౌమ్యుడిగా పేరుంది. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడనని అక్కడి వారంటూ ఉంటారు. ఈ తరుణంలో ప్రభత్వ పథకాలు, కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన మందుంటాడని అంటుంటారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్మించే శ్మశాన వాటికను తమ గ్రామంలో నిర్వహించాడనికి పూనుకున్నారు. దగ్గరుండి దీనిని పూర్తి చేయించారు.
అయితే సర్పంచ్ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండేవారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కుమారస్వామి ఏప్రిల్ 29న పురుగుల మందు తాగి ప్రాణాలను విడిచాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన మే 2న మరణించారు. సర్పంచ్ ఎంతో శ్రద్ధతో కట్టించిన శ్మశాన వాటికలోనే ఆయన దహన సంస్కారాలు చేశారు. ప్రజలకు ఉపయోగ పడేవిధంగా దీనిని నిర్మించడంతో కొన్ని కారణాల వల్ల ఇది ప్రారంభం కాలేదు. దీంతో సర్పంచ్ దేహాన్ని ఆ శ్మశాన వాటికలో ఖననం చేసి ప్రారంభించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.