Homeజాతీయ వార్తలుSanjiv Khanna: సుప్రీం కోర్టు కొత్త సీజేగా సంజీవ్‌ఖన్నా.. ఆయన నేపథ్యం.. తెలుసా?

Sanjiv Khanna: సుప్రీం కోర్టు కొత్త సీజేగా సంజీవ్‌ఖన్నా.. ఆయన నేపథ్యం.. తెలుసా?

Sanjiv Khanna: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. ఈ న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. దేశంలోని అన్ని కోర్టులకు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు, కేంద్రం సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ ఖన్నాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. నవంబర్‌ 11న ఆయన బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నవంబర్‌ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నూతన సీజేఐని నియమించారు. సంజీవ్‌ ఖన్నా 1960, మే 14న జని‍్మంచారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. తిసాహజాఈ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులు వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు.

2005లో న్యాయమూర్తిగా..
ఇక సంజీవ్‌ఖన్నా 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయా‍్యర. తర్వాత ఏడాదికే శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయా‍్యరు. 2019 జనవరి 18న సుప్రీంకోరు‍్ట న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూరితగా పనిచేయకుండానే నేరుగా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఘనత సాధించిన కొద్ది మందిలో ఒకరిగా నిలిచారు. ఇక సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ఆర్‌.ఖన్నాకు ఆయన మేనలు‍్లడు. ఇక 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించిన సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌ఆర్‌ ఖన్నా సభ్యుడు. ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఊడా సస్పెండ్‌ చేయవచ్చంటూ 1976లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వలువరించిన తీరు‍్పతో విభేదించిన ఏకైక సభ్యుడిగా ప్రసిద్ధుడు. ఈ కారణంగానే ఆయనను సీజేఐ పదవి వరించలేదు.

సంజీవ్‌ ఖన్నా చరిత్రాత్మక తీర్పులు
ఇదిలా ఉంటే.. జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా న్యాయ కోవిదునిగా పేరు పొందారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్‌ ఓటింగ్‌కు చెక్‌ పెడతాయని స్పష్టం చేయడమే కాకుండా ఎన్నికల్లో వాడడాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. వీవీ పా‍్యట్ల ద్వారా ఈవీఎం ఓట్లను నూరుశాతం వెరిఫై చేయాలని దాఖలైన కేసును కొట్టివేసిన ఆ ధర్మాసనానికి సంజీవ్‌ఖన్నా సారథి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు నా‍్యయమూర్తుల రాజా‍్యంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఖన్నా సభ్యుడు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో కూడా ఖన్నా సభ్యుడు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన ఢిలీ‍్ల మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారం చేసుకునేలా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version