Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: యష్మీ, ప్రేరణ పై నోరు పారేసుకున్న గౌతమ్..ఓవర్ యాక్షన్ చేసిన...

Bigg Boss Telugu 8: యష్మీ, ప్రేరణ పై నోరు పారేసుకున్న గౌతమ్..ఓవర్ యాక్షన్ చేసిన గంగవ్వ..అర్థరాత్రి బిగ్ బాస్ హౌస్ లో గొడవలు!

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి మెగా చీఫ్ అయిన వెంటనే గౌతమ్ ఆడవాళ్ళకు ఇంటి పనుల నుండి సెలవు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అబ్బో ఈయనకి ఆడవాళ్లు అంటే ఎంత గౌరవమో అని అందరూ అనుకున్నారు. గత సీజన్ లో కూడా ఆయన ఇంటికి కెప్టెన్ అయిన తర్వాత ఇలాంటి రూల్స్ పెట్టాడు. కానీ ఆయన అప్పట్లో ఆడవాళ్ళ మీద అరిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ నిన్న మాత్రం ఆయన పెద్ద కారణం లేకపోయినా కూడా యష్మీ, ప్రేరణ పై విరుచుకుపడ్డాడు. నిన్న మెగా చీఫ్ కంటెండర్స్ అయ్యేందుకు హౌస్ మేట్స్ కి ఒక క్విజ్ టాస్క్ ని పెడుతాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలక్ నిర్ణయం నచ్చకపోవడం తో గౌతమ్ గొడవకు దిగుతాడు. ఆ క్రమంలో ప్రేరణ మాట్లాడేందుకు ముందుకు వస్తే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు యష్మీ ప్రస్తావన వస్తుంది.

అప్పుడు యష్మీ మధ్యలో దూరి గౌతమ్ తో సీరియస్ గా మాట్లాడేందుకు ముందుకు రాగా ‘మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావ్..నీకు సంబంధం లేదు’ అని అంటాడు. అప్పుడు యష్మీ ‘సంబంధం లేదని ఎలా అంటావ్..నువ్వు నా పేరు తీసావు కదా’ అని అంటుంది. దానికి గౌతమ్ కి కోపం ‘పో అవతలకి’ అని గట్టిగా అరుస్తాడు. ఈ విషయం లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది నేడు పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. అయితే సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ‘ఆడియన్స్ ఓట్ల కోసం అమ్మాయిలకు ఇంటి పనుల నుండి సెలవు ప్రకటిస్తున్నట్టు చెప్తాడు. కానీ గౌతమ్ నిజమైన క్యారక్టర్ ఇది. అమ్మాయిల మీద ఎలా అరుస్తున్నాడో చూడండి ‘ అంటూ విమర్శిస్తుంటే, గౌతమ్ అభిమానులు మాత్రం ‘వింటేజ్ గౌతమ్ ఈజ్ బ్యాక్’ అని సంబరాలు చేసుకుంటున్నారు. నువ్వు అరిస్తే సైలెంట్ గా ఉండడానికి అక్కడ ఉండేది మణికంఠ కాదు, గౌతమ్ అని చెప్తూ ట్వీట్స్ వేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే గౌతమ్ గత కొంతకాలం నుండి యష్మీ తో మంచి స్నేహంగా మాట్లాడుతూ, ఆమెకి గత వీకెండ్ లో ప్రపోజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ యష్మీ కి మాత్రం గౌతమ్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఆమెకి నిఖిల్ అంటే ఇష్టం ఉంది. నిఖిల్ ని ఉడికించేందుకు యష్మీ గౌతమ్ తో పులిహోర కలుపుతున్నట్టు నటిస్తుంది. ఇది పాపం గౌతమ్ కి తెలియదు, తనతో నిజంగా ఇష్టంతోనే మాట్లాడుతుందని అనుకున్నాడు. ఇదంతా చూసిన గౌతమ్ అభిమానులు యష్మీ మాయలో పడి గేమ్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాడు, గౌతమ్ లో ఫైర్ మిస్ అవుతుందని బాధ పడ్డారు. నిన్న యష్మీ పై అంత కోపంగా అరవడంతో ఇప్పుడు గౌతమ్ ట్రాక్ లోకి వచ్చాడు అని ట్వీట్స్ వేస్తున్నారు. గౌతమ్ అయితే ఇక యష్మీ ని స్నేహితురాలిగా కూడా పరిగణించను అని హరితేజ తో అంటున్నాడు, మరి ఎంతవరకు ఆ మాట మీద నిలబడుతాడో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version