Jio Hotstar Domain: మన దేశంలోనే వినోద పరిశ్రమ లో అతిపెద్ద డీల్ జియో సినిమాస్, హాట్ స్టార్ మధ్య జరిగింది. ఇప్పటికే వయాకాం, నెట్వర్క్ 18, జియో సినిమాస్ పేరుతో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రిలయన్స్ ప్రవేశించింది. భారీగానే లాభాలను ఆర్జిస్తోంది. ఈ క్రమంలో భారతీయ వినోద పరిశ్రమపై గుత్తాధిపత్యాన్ని సాధించాలని భావించి రిలయన్స్ సరికొత్త విలీనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది వేసవికాలంలో ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ ను కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి విలీన ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో విలీనం కూడా జరగనుంది. ఈ విలీనం పూర్తయితే జియో సినిమాస్ హాట్ స్టార్.. రెండు కలిసిపోయి జియో హాట్ స్టార్ గా మారనున్నాయి. అయితే విలీనానికి సంబంధించి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పలేమని జియో, హాట్ స్టార్ వర్గాలు అంటున్నాయి.
డొమైన్ కొనేశాడు
జియో, హాట్ స్టార్ విలీనాన్ని ముందుగానే యువకుడు ఊహించాడు. అతడు ఒక యాప్ డెవలపర్ గా పనిచేస్తున్నాడు. తనకున్న తెలివితేటలతో జియో హాట్ స్టార్. కామ్(jio hotstar.com) పేరుతో డొమైన్ కొనుగోలు చేశాడు. అతడు అంతటితోనే ఆగలేదు. వెంటనే దానిని అమ్మకానికి పెట్టాడు. దానిని జియో సినిమాకు ఇస్తానని.. కాకపోతే తాను కేమ్ బ్రిడ్జిలో చదువుకుంటానని.. దానికి అయ్యే ఖర్చు మొత్తం రిలయన్స్ భరించాలని షరతు విధించాడు. అలా అయితేనే రైట్స్ ఇస్తానని పేర్కొన్నాడు. ఇది రిలయన్స్ కంపెనీకి చిరాకు కలిగించింది. అలా డబ్బు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కోర్టు మెట్లు ఎక్కింది. అయితే అతడికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వబోమని రిలయన్స్ చెబుతోంది. ఇది కార్పొరేట్ వర్గాలలో సంచలనంగా మారింది.. అయితే ఆ యాప్ డెవలపర్ ఒక పేద కుటుంబానికి చెందినవాడు. తనకున్న ప్రతిభతో ఇక్కడ దాకా వచ్చాడు. అతడికి లండన్ లోని కేం బ్రిడ్జి లో చదువుకోవాలని కోరిక ఉంది. దానికోసం అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే న్యాయపరంగా రిలయన్స్ కనుక వెళ్తే ఆ యాప్ డెవలపర్ కు చిక్కులు తప్పేలా లేవని కార్పొరేట్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ మధ్యే మార్గంగా చర్చలు జరిపితే ఎంతో కొంత పరిహారం ఆ యాప్ డెవలపర్ కు దక్కే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ జియో హాట్ స్టార్ డొమైన్ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుందో..