Homeజాతీయ వార్తలుSam Pitroda: మరో వివాదంలో శామ్‌పిట్రోడా.. ఈసారి చైనాపై సానుభూతి!

Sam Pitroda: మరో వివాదంలో శామ్‌పిట్రోడా.. ఈసారి చైనాపై సానుభూతి!

Sam Pitroda: కాంగ్రెస్‌కు చెందిన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ నేత శామ్‌ పిట్రోడా. ఈయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనతోపాటు కాంగ్రెస్‌ పార్టీని కూడా ఇరుకున పెట్టారు. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా(Chaina ) పిట్రోడా సానుభూతి చూపారు. చైనాను శత్రువులా చూడొద్దని పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఎలా ఉంటుందో చెప్పలేమని హెచ్చరించారు. భారత్‌(Bharath)తన వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు. తొలి నుంచి అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరితో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగతుందని వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పు ఉందో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. చైనాతో భారత్‌ ఎప్పుడూ ఘర్షణాత్మక వైఖరితోనే ఉందని, ఇప్పటికైనా మారాలని సూచిచారు. ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకూ వర్తిస్తుందని తెలిపారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూడడం సరికాదని అన్నారు.

కాంగ్రెస్‌ వైఖరికి భిన్నంగా..
కాంగ్రెస్‌ నేత అయిన శామ్‌ పిట్రోడా(sham pitroda).. ఆ పార్టీ వైకరి, సిద్ధాంతాకు భిన్నంగా మాట్లాడుతున్నారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ తరచూ ఆరోపిస్తున్నారు. అయినా మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh)చాలా భూభాగం ఇప్పటికే ఆక్రమణకు గురైందని తెలిపారు. మరోవైపు చైనా కూడా తరచూ సరిహద్దులు మారుస్తూ మ్యాప్‌లు విడుదల చేస్తుంది. భారత్‌ను రెచ్చగొడుతోంది. గాల్వన్‌(Galwan) ఘటన తర్వాత చైనా, భారత్‌ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితిలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై నెటిజనుల మండిపడుతున్నారు.

గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు..
శామ్‌ పిట్రోడా గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఇరకాటంలో పడడంతోపాటు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశారు. ఆస్తి పన్ను, ఐటీ, భారత్‌లో దక్షిణ భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారత్, చైనా సంబంధాల గురించి మాట్లాడారు. ఇప్పటికే చైనా భారత్‌ మధ్య అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలో భారత్‌ను తక్కువ చేసేలా చైనాను గొప్పగా కీర్తిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular