Actor Brahmaji : టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటు కామెడీ.. అటు విలన్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కామెడీ విలన్ గా ఆయనకు కొన్ని పాత్రలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సీనియర్ నటుడిగా తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. ఇటీవల విడుదల అవుతున్న చాలా సినిమాల్లో ఆయన కనిపిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీకి దగ్గర స్నేహితుడు కావడంతో ఆయన ప్రతి చిత్రంలో కనిపించే వారు బ్రహ్మాజీ. 90ల నాటి నుంచే ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నారు. స్టార్ హీరోలు నటించే సినిమాల్లో కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పోతే ‘సింధూరం’ చిత్రంలో హీరోగా కూడా చేశారు.
ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తన కెరీర్లో ఇప్పటి వరకు దాదాపు 200 వరకు సినిమాలు చేశారు. ఇక తాజాగా ఆయన ముఖ్య పాత్రతో ‘బాపు’ అనే చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు మద్దతిస్తూ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న టీజర్ విడుదల చేశారు. బ్రహ్మాజీ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోని పలు అంశాలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో హాస్య బ్రహ్మా బ్రహ్మానందం గురించి మాట్లాడారు.
కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇటీవల కాలంలో చాలా సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఒకటి రెండు అంతకంటే ఎక్కువగా కనిపించడం లేదు. ఇదే తరహాను బ్రహ్మాజీ కూడా ఫాలో అవుతున్నారా? అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. బ్రహ్మానందానికి ఇండస్ట్రీలోని ఏ నటుడికి అస్సలు పోలిక అనేదే ఉండదు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 1500 సినిమాల్లో నటించారు. వెల్ సెటిల్డ్. బాగా సంపాదించుకున్నారు. ఆయకు పోయేది ఏమీ లేదు కాబట్టి అలా చెబుతుంటారు. ఆయనో మహానుభావుడు. కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనకు సినిమాలు అవసరం ఏమాత్రంలేదు. ఇండస్ట్రీలో ఆయన చేయనటువంటి పాత్రలేదు. ఆయన కామెడీలో ప్రస్తుతం మేం 10శాతం చేసినా పాత్రలు పండిపోతున్నాయి.
బ్రహ్మానందం కాలక్షేపానికి మాత్రమే సినిమాలను చేస్తున్నారు. ఆయనను ఎవరూ ఫాలో కాలేరు. ఇక ఇఫ్పుడు మేమంతా బ్రహ్మానందం నటించిన చిత్రాల్లో సగం కూడా లేం. ఆయనతో ఎవరినీ పోల్చకండి.. అంటూ రిప్లై ఇచ్చారు. ఇక బ్రహ్మానందం తాజాగా కొడుకు గౌతమ్ తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అయింది. ఇక సినిమాకు మంచి టాక్ వచ్చింది. బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మూలంగా సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాకు ముందు ‘రంగమార్తాండ’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించారు. ఆయన కమెడియనే కాదు… అసలైన నటుడు అని మరోమారు నిరూపించారు. ఇక బ్రహ్మాజీ విషయానికొస్తే అర డజన్‌కు పైగా సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్నారు.