Prakash Raj: ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయింది, బాధ పడింది ప్రకాష్ రాజ్ అనే నటుడు కాదు. ఆ నటుడికి వత్తాసు పలికి అతన్ని గెలిపించడానికి నానాపాట్లు పడిన మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా నాగబాబు. ప్రకాష్ రాజ్, చిరంజీవి క్యాంపు ప్రమేయంతోనే ‘మా’ ఎన్నికల్లో నిలబడ్డాడు. తనకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి గెలుపు సులభం అనుకున్నాడు. నాగబాబు కూడా ఆ బలుపుతోనే ఇష్టం వచ్చిన కామెంట్లు చేశాడు.

ముఖ్యంగా కోట పై నీచమైన కామెంట్స్ చేశాడు. కోటా శ్రీనివాసరావు గారి వయస్సును గమనించకుండా, గౌరవించకుండా వ్యక్తగత తిట్లు అందుకున్నాడు. అసలు కోట శ్రీనివాస రావుతో ప్రకాష్ రాజ్ ని ఎలా పోల్చాడు ? పైగా కోట గారిని ఇబ్బందికరంగా తిట్టాడు. ఈ కామెంట్లు చాలవా ? ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి.! తెలుగులో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న కోట లాంటి వారిని ప్రకాష్ రాజ్ కాలి గోటికి సరిపోరన్న మాటలు విన్న తర్వాత నాగబాబుకి ఇంత పొగరా అనిపించింది అందరికీ.
పరిశ్రమ మీద మెగా కుటుంబం ఆధిపత్యం కోసం మీ మోచేతి నీళ్లు తాగే ప్రకాష్ రాజ్ ని గెలిపించాలా ? అన్న భావన కలిగింది చాలామందికి. దీనికితోడు మెగా కుటుంబ మద్దతు ఉందని చెలరేగిపోయి పెద్దవాళ్ళు అందరిని తిడుతున్న ప్రకాష్ రాజ్ కి బుద్ది చెప్పాలని మా సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే ఓట్లు వేశారు.
మొత్తానికి ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. కాదు, తమ విపరీత మనస్తత్వంతో నీచమైన వ్యాఖ్యలతో మెగా బ్రదర్ నాగబాబు ఓడించాడు. చివరకు మెగా ఫ్యామిలీని నమ్ముకుంటే ఎవ్వడికైనా పట్టే గతి ఇదే అనిపించేలా మెగా ఇమేజ్ ను దిగజార్చాడు నాగబాబు. నిజానికి నరేష్ కి ఆపోజిట్ గా మాట్లాడమని చిరంజీవి నాగబాబుకి అనుమతి ఇచ్చాడు.
కానీ నాగబాబు ఏమి చేశాడు ? కోట, బాబు మోహన్ లాంటి వారి పై విమర్శలు చేశాడు. బాబు మోహన్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మంత్రి అయ్యాడు. అలాంటి వ్యక్తి పై నాగబాబు చిల్లరగా కామెంట్లు చేశాడు. అసలు వయసు అందరికీ అయిపోతుంది. ఎవరూ శాశ్వతం కాదు. మనం మాట్లాడిన మాటలే శాశ్వతం అని నాగబాబుకి తెలియకపోవడం విచిత్రం.
అయినా, కోట గారి కామెడీ టైమింగ్ లో ప్రకాష్ రాజ్ ఏ మేరకు ? అసలు కోట శ్రీనివాసరావు గారితో ప్రకాశ్ రాజ్ తో పోలిక ఎలా ఉందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా నటన గురించి నటన రాని వాడు మాట్లాడితే విలువ ఉండదు అని నాగబాబు ఎవరు చెప్పాలి ? నాగబాబు వల్లే చిరంజీవి గారి కుటుంబానికి చెడ్డపేరు వస్తోంది.
నాగబాబు ఇప్పటి వరకు రెండు సార్లు సపోర్ట్ చేసిన ప్యానెల్ అధ్యక్షులు ఓడిపోయారు. ఇది చాలదా ? ఆయన తన స్థాయి ఏమిటో గ్రహించడానికి ? నాగబాబు కారణంగా “ఇండస్ట్రీకి పెద్ద దిక్కు” అనే టైటిల్ ని మెగాస్టార్ పోగొట్టుకుంటున్నారు. తన మనిషిని ‘మా’ ప్రెసిడెంటుగా గెలిపించుకోలేనివాడు ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతాడు ?, ఏది ఏమైనా ఓటమి.. ప్రకాష్ రాజ్ ది కాదు, మెగా కుటుంబానిది