మండలి రద్దుపై నోరుజారిన సజ్జల?

శాసనమండలి రద్దు వ్యవహారం రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు శాసనమండలి రద్దు గురించి మాట్లాడిన నేతలు ఇటీవల కాలంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మండలిలో తగినంత మంది సభ్యుల బలం లేక రద్దు చేయాలని తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అదే వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. మెల్లగా మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దాని రద్దు గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ రఘురామ కృష్ణంరాజు మాత్రం ఈ […]

Written By: Srinivas, Updated On : June 21, 2021 7:00 pm
Follow us on

శాసనమండలి రద్దు వ్యవహారం రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు శాసనమండలి రద్దు గురించి మాట్లాడిన నేతలు ఇటీవల కాలంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మండలిలో తగినంత మంది సభ్యుల బలం లేక రద్దు చేయాలని తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అదే వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. మెల్లగా మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో దాని రద్దు గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ రఘురామ కృష్ణంరాజు మాత్రం ఈ రోజు కూడా మండలి రద్దు గురించి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి రఘురామ లేఖపై స్పందించారు. శాసనమండలి రద్దు తీర్మానం వెనక్కి తీసుకోవడం లేదని చెప్పారు. మండలి రద్దు తీర్మానం ఎత్తుగడతో చేసింది కాదని కూడా వాదించారు.

ఈ ప్రకటన అందిపుచ్చుకున్న రఘురామ వెంటనే మరో ప్రకటన చేశారు. మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదని సజ్జల చెప్పడంతో సీఎం జగన్, సజ్జలకు శుభాభినందనలు తెలిపారు. మండలి రద్దు అయ్యే వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తానని హామీ ఇచ్చారు. మండలి రద్దు నా బాధ్యతగా స్వీకరించి పని చేస్తానని పేర్కొన్నారు.

మండలి రద్దు కోసం రఘురామకృష్ణంరాజు కేంద్రానికి, రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాయడమో వ్యక్తిగతంగా కలిసి వైసీపీ విధానం ప్రకారం రద్దు చేయమని కోరడమో చేస్తారు. ఈ అంశంపై రఘురామ రచ్చ చేస్తే వైసీపీకి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రఘురామకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక వైపీపీ నానా తంటాలు పడుతోంది.