
ఏపీలో మహిళకు రియల్ టైం భద్రత కల్పించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగటం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారిక నివాసానికి సమీపంలో సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద యువతిపై అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దిశా చట్టం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారు. 24 గంటల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డీజీపీ గౌతం సవాంగ్ కు చంద్రబాబు లేఖ రాశారు.