Homeఆంధ్రప్రదేశ్‌నిరుద్యోగుల్లో కోపం.. కంట్రోల్ కు సజ్జల యత్నం

నిరుద్యోగుల్లో కోపం.. కంట్రోల్ కు సజ్జల యత్నం

Sajjalaఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ని ఎద్దేవా చేశారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. అయినా వారిలో ఆందోళన తగ్గలేదు. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.

రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో ఉద్యోగాల ఊసు లేకుండా పోయింది. రఘురామ వ్యవహారం పుణ్యమాని జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా అందులో ఉద్యోగాలు లేవని వాపోతున్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తీరా నోటిఫికేషన్ లో తక్కువ పోస్టులు ఉండడం కలవర పెడుతోందన్నారు. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఉపాధ్యాయ పోస్టుల్లో కూడా నిరసన పెరుగుతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై ఓ దినపత్రికలో కథనం ప్రచురితం కావడతో ప్రజలు దాంతో ఏకీభవించి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు సజ్జల రంగంలోకి దిగారు. నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చిన తరువాత టీచర్ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ప్రీప్రైమరీ, అంగన్ వాడీ స్కూళ్లను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. విద్యారంగాన్ని గాడిలో పెట్టాలని చూస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్లలో1.83 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని సజ్జల పేర్కొన్నారు. ఇవన్ని పత్రికలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల బాధలు చూసి గెస్ట్ టీచర్స్ ను నియమించామన్నారు. ఏదేమైనా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడేందుకు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. కానీ నిరుద్యోగుల్లో పెరుగుతున్న నిరసనకు ఆయన ఎలా నిలుస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular