Sajjala – Pawan Kalyan: ప‌వ‌న్ సినిమాల కోసం టికెట్ల రేట్లు త‌గ్గించ‌లేదు.. స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Sajjala – Pawan Kalyan: ఏపీలో థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ విషయమై సోషల్ మీడియాలో దుమారమే రేగుతోంది. ఏపీ మంత్రులు వర్సెస్ టాలీవుడ్ ప్రముఖులు అనేంతలా సీన్ క్రియేట్ అయింది. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేయగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వర్మ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే పేర్ని నాని వర్సెస్ వర్మ.. వార్ జరిగింది. ఇంకా జరుగుతోంది కూడా. […]

Written By: Mallesh, Updated On : January 6, 2022 12:45 pm
Follow us on

Sajjala – Pawan Kalyan: ఏపీలో థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ విషయమై సోషల్ మీడియాలో దుమారమే రేగుతోంది. ఏపీ మంత్రులు వర్సెస్ టాలీవుడ్ ప్రముఖులు అనేంతలా సీన్ క్రియేట్ అయింది. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేయగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వర్మ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే పేర్ని నాని వర్సెస్ వర్మ.. వార్ జరిగింది. ఇంకా జరుగుతోంది కూడా. వర్మ ప్రశ్నలకు సమాధానాలిచ్చిన నానికి.. వర్మ మళ్లీ కౌంటర్స్ వేశారు. కాగా, ఈ విషయాలపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ చిత్రాలపైన కూడా సజ్జల కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమని కామెంట్స్ చేశారంటే..

Sajjala – Pawan Kalyan

ఏపీలోని థియేటర్స్ టికెట్ల విషయమై వివాదానికి పరిష్కారం త్వరలో లభిస్తుందని అన్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్‌‌ను టార్గెట్ చేసి తాము టికెట్ల రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోలేదని సజ్జల స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఏడాది ఒకటో, రెండో సినిమాలు చేస్తారని, ఆయన సినిమా రూ.50 లేదా రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తాయని తెలిపారు. దాని కోసం ప్రత్యేకంగా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్.. అల్లు అరవింద్‌కు గట్టి షాక్ ఇచ్చిన మమ్ముట్టి..!

సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో కమిటీ వేశామని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తాము ఆశిస్తున్నామని అన్నారు. ఇకపోతే పెట్టిన పెట్టు బడులు అన్నీ వారం రోజుల్లో రాబట్టుకోవాలని ప్రొడ్యూసర్స్ చూస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం మీద రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్ కార్టూన్స్ వేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయని సెటైరికల్ కౌంటర్ వేశారు.

ఈ సంగతులు అలా ఉంచితే.. తాను సినీ ఇండస్ట్రీ తరఫున వచ్చి తమ సమస్యలకు సంబంధించిన వివరణ ఇస్తానని, అనుమతిస్తే వచ్చి కలుస్తానని పేర్ని నానిని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా, ఆ ట్వీట్ కు పేర్ని నాని సానుకూల రిప్లయి ఇచ్చారు. వర్మకు ధన్యవాదాలు తెలుపుతూనే, త్వరలో కలుద్దామని అన్నారు పేర్ని నాని.

Also Read: ఆయనెవరో నాకు తెలీదు.. మంత్రి కొడాలి నానిపై వర్మ వ్యంగ్యాస్త్రాలు

Tags