Dharmana Prasada Rao: ధర్మాన ప్రసాదరావు అంటే ఏపీ రాజకీయాల్లో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగున్నా.. గతంలో ఆయన మంత్రిగా సేవలందించారు. కానీ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోంది. ఆయన ఎందుకో అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. కానీ ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆయన కావాలనే అలా మాట్లాడారా? లేక అనుకోకుండా ఆ వ్యాఖ్యలు చేశారా అన్నది మాత్రం తెలియదు.
కానీ, రెండు, మూడు రోజులుగా ఆయన చేస్తున్న కామెంట్స్ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం చెత్తకు సంబంధించిన కొన్ని కామెంట్స్ చేశారు. అందులో ఆయన ఫ్రస్టేట్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తను వారి ఇంటి ముందే పారేయాలని అధికారులను ఆదేశించారు. ఆ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read: పవన్ సినిమాల కోసం టికెట్ల రేట్లు తగ్గించలేదు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
మరో వైపు విపక్షాలు కూడా ఆయన కామెంట్స్ పై ఫైర్ అవుతున్నాయి. దీనికి తోడు తాజాగా ఉపాధి హామీ పథకం విషయంపైనా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ పథకం వల్ల పోరంబోకులు తయారవుతున్నారని అన్నారు. రెండు గంటల పనికి డబ్బులు చెలిస్తే.. ఇక వ్యవసాయ పనులకు ఎవరు వస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి పథకాలు దేశ వినాశనానికి దారి తీస్తాయని చెప్పారు.
ధర్మాన ఇలా మాట్లాడుతున్నాడేంటి రాజకీయాలకు కొత్తగా వచ్చారా అనుకుంటే పొరపాటే.. ఆయన చాలా అనుభవం ఉన్న నేత. మంత్రిగా సైతం సేవలందించారు. అన్నింటిపై ఆయనకు అవగాహనుంది. కాక పోతే తనకు మంత్రి పదవి దక్కలేదనే దిగులు మాత్రం ఉన్నట్టు తెలుస్తోంది. అది మినహా పార్టీలో ఆయన బాగానే కొనసాగుతున్నారు. కాకపోతే మంత్రి పదవి లేదనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆయన కాస్త ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ ఇలా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని టాక్. మరి ఆయన మాటలపై పార్టీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. లేదంటే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇప్పటికైనా ఆయన సంచలన కామెంట్స్ చేయడం ఆపేస్తారో లేదో చూడాలి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తున్న పేదరికం.. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ..