https://oktelugu.com/

Akhanda Movie: బాలయ్య అఖండ ఓటిటి రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్… అఫిషియల్ గా అనౌన్స్ ?

Akhanda Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో ద్వైపాత్రాభినయంలో మెప్పించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. శ్రీకాంత్ విలనిజం, ప్రగ్యా జైస్వాల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 6, 2022 / 12:41 PM IST
    Follow us on

    Akhanda Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో ద్వైపాత్రాభినయంలో మెప్పించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. శ్రీకాంత్ విలనిజం, ప్రగ్యా జైస్వాల్ నటనతో మెప్పించారు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది అని చెప్పాలి. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

    ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే ముందు ఈ సినిమాను జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని జనవరి 21న విడుదల చేయనున్నట్లు తెలిపింది ఓటీటీ సంస్థ. అఖండ తెలుగు సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందంటూ బాలయ్య అభిమాని ఒకరు ట్వీట్ చేయగా… అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇస్తూ అసలు విషయం చెప్పింది.

    ఈ మేరకు ఆ ట్వీట్ లో ” 21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.