https://oktelugu.com/

సాగర్ ఉప ఎన్నిక: భారీగా పోలింగ్.. ఎంతంటే?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పోటీదారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి చెదురు మొదురు ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే ఉప ఎన్నికలకు సహజంగా ఓటింగ్ శాతం తగ్గుతుంది. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాగర్ లో ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 81.5శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పార్టీల నేతలందరూ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2021 / 09:11 PM IST
    Follow us on

    నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పోటీదారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి చెదురు మొదురు ఘటనలు చోటుచేసుకోలేదు.

    అయితే ఉప ఎన్నికలకు సహజంగా ఓటింగ్ శాతం తగ్గుతుంది. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    సాగర్ లో ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 81.5శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పార్టీల నేతలందరూ పోటీ పడి మరీ ప్రజలను తరలించడంతో ఈ పోలింగ్ నమోదైంది.

    ప్రతి పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకే పార్టీ ప్రతినిధులను అనుమతించడం.. ఓటరు రసీదులు సిబ్బంది నుంచి మాత్రమే తీసుకోవాలని ఈసీ ఆదేశించినందున పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి తగ్గింది.

    సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లను పోలింగ్ కు అనుమతించారు. ఆ తర్వాత 6-7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది అభ్యర్థులు ఈసారి నిలిచారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

    కాగా పోలింగ్ సరళిని బట్టి చూస్తే అధికార టీఆర్ఎస్ కే కాస్త ఎడ్జ్ లభిస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జానారెడ్డికి కూడా గట్టి పోటీ ఇచ్చాడని అంటున్నారు. బీజేపీకి ఇక్కడ కష్టమేనంటున్నారు. మొత్తంగా ఎవరిది గెలుపు అనేది bo 2న ఓట్ల లెక్కింపుతో తేలనుంది.