వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. క్లిక్ చేస్తే కొంప కొల్లేరే..?

దేశంలో వాట్సాప్ యాప్ ను ఉపయోగించే కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో వాట్సాప్ యాప్ ద్వారా మోసాలు చేసేవాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. వాట్సాప్ రంగుల గురించి కొత్త కొత్త లింకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లింకులను పొరపాటున క్లిక్ చేస్తే మాత్రం నష్టపోతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లింక్ లను క్లిక్ చేయకపోతే వాట్సాప్ పని చేయదని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. పింక్ వాట్సాప్ అంటూ […]

Written By: Navya, Updated On : April 18, 2021 1:16 pm
Follow us on

దేశంలో వాట్సాప్ యాప్ ను ఉపయోగించే కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో వాట్సాప్ యాప్ ద్వారా మోసాలు చేసేవాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. వాట్సాప్ రంగుల గురించి కొత్త కొత్త లింకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లింకులను పొరపాటున క్లిక్ చేస్తే మాత్రం నష్టపోతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లింక్ లను క్లిక్ చేయకపోతే వాట్సాప్ పని చేయదని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

పింక్ వాట్సాప్ అంటూ ఈ మధ్య ఒక లింక్ వైరల్ అవుతోంది. పింక్ వాట్సాప్ లో అదనపు ఫీచర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా నకిలీ మెసేజ్ కాగా అధికారిక వాట్సాప్‌కు, దీనికి ఎటువంటి సంబంధం లేదు. నకిలీ మెసేజ్ ను క్లిక్ చేస్తే ఆ తరువాత పేరు, మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పొరపాటున ఎంటర్ చేశారంటే సైబర్ నేరగాళ్ల చేతికి సమాచారం చేరే అవకాశాలు ఉంటాయి.

వాట్సాప్ లో ప్రస్తుతం ఈ తరహా లింకులు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ కాంటాక్ట్స్ అందరికీ ఈ లింక్ సెండ్ అయిపోతుంది. ఈ లింక్ ను క్లిక్ చేస్తే మీరున్న గ్రూపుల్లో కూడా మీకు తెలియకుండానే ఆ లింక్ పోస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉంటే మంచిది. వాట్సాప్ పేరుతో వచ్చే ఫేక్ లింక్‌లను క్లిక్ చేస్తే మోసపోయే అవకాశాలు ఉంటాయి.

ఈ నకిలీ లింక్‌ను ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే ఫోన్ ను రీసెట్ చేసుకుంటే మంచిది. మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల పాస్ వర్డ్‌ లను వెంటనే మార్చుకుంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.