దొంగ ఓట్లు, దొంగ ఓటర్లు పట్టుబడ్డ వేళ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రసాభాసగానే ముగిసింది. టీడీపీ, బీజేపీ నేతలు రోడ్డెక్కి దొంగ ఓటర్లపై ఆందోళనలు చేశారు. దొంగ ఓటర్లను పోలింగ్ బూత్ లకు వెళ్లి పట్టుకున్నారు. ఇంతటి ఆందోళనల నడుమే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ముగిసింది.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు సాగింది. తిరుపతి లోక్ సభ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 55శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల వరకు కరోనా బాధితులు ఓటు వేశారు.
తిరుపతి లోక్ సభ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి నియోజకవర్గంలో పోలింగ్ శాతం భారీగానే తగ్గింది. తిరుపతిలో 45.84శాతం, సర్వేపల్లి నియోజకవర్గంలో 57.91శాతం , గూడురు నియోజకవర్గంలో 51.82శాతం , సూళ్లూరుపేటలో 60.11శాతం, వెంకటగిరిలో 55.88శాతం , శ్రీకాళహస్తిలో 57శాతం , సత్యవేడులో 58.4శాతం పోలింగ్ నమోదైంది.