రాజస్థాన్ లో ఈనెల 14నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎడారి రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటి సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న వివాదం చివరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీసింది. బోటాబోటి మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే ఝలక్ ఇవ్వడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. సచిన్ పైలట్ సహా, ఆయన వర్గం నేతలపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయడంతో రాజస్థాన్ రాజకీయాల్లో కుదుపు తప్పదని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read: సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆదిత్య థాకరే?
సచిన్ పైలట్ కాంగ్రెసులోకి తిరిగి రావడంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. సచిన్ వర్గం సీఎం గెహ్లాట్ పై తిరుగుబాటు చేశాక ఆయన బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జరిగింది. దీనిని ఆయన ఖండిస్తూ తాను బీజేపీలో చేరేది లేదని ప్రకటించారు. దీంతో ఆయన సొంత పార్టీ పెడుతారనే టాక్ విన్పించింది. ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నెలరోజులు గెలిచిన పార్టీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయనకు పార్టీ పెట్టే ఆలోచన లేదని తేలిపోయింది. గత సోమవారం రాహుల్, ప్రియాంకగాంధీతో పైలట్ బేటి అయ్యారు. తాను పార్టీకి వ్యతిరేకం కాదని చెబుతూనే సీఎం గెహ్లాట్ పై తన అసంతృప్తిని వెళ్లగాక్కారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక ముందు తన డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది.
సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ చేరేందుకు రాహుల్, ప్రియాంక ముందు తన కోరికల చిట్టాను వినిపించినట్లు తెలుస్తుంది. దీనికి వారిద్దరూ సానుకూలత వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి పార్టీలోకి రానున్నారు. ప్రధానంగా ఆయన రాబోయే రోజుల్లో సీఎం పదవీ తనకే కేటాయించాలని కోరినట్లు తెలుస్తుంది. తనకు ప్రభుత్వం ఇంతక ముందున్న డిప్యూటి సీఎం పదవీ, పీసీసీ చీఫ్ పదవీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల కక్ష్య సాధింపులు లేకుండా మరో డిప్యూటి సీఎం పదవీని తన వర్గం ఎమ్మెల్యేలకు కేటాయించాలని కోరారు. వీటితోపాటు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవీ తనకు కట్టబెట్టాలని సచిన్ షరతులు పెట్టాడట. వీటిన్నింటికి కాంగ్రెస్ అధిష్టానం సానుకూలత వ్యక్తం చేయడంతో తిరిగి సొంతగూటికిలోకి చేరుతున్నారు.
Also Read: అర్ధరాత్రి రఫేల్స్ తో భారత్ సీక్రెట్ ఫైట్?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లదే హవా నడుస్తోంది. వీరి కారణంగానే రాహుల్ సైతం పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టడం లేదని టాక్ విన్పిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి దేశంలో నానాటికీ దిగజారుతోంది. సీనియర్ల కారణంగానే కాంగ్రెస్ యువనేతలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవీని కావాలని కోరడం ఆసక్తిని రేపుతోంది. ఇకపై కాంగ్రెసును సచిన్ పైలట్ నడిపించబోతున్నారనే టాక్ విన్పిస్తుంది. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెసులో యువకులకు పెద్దపీఠ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయిలో రాహుల్, ప్రియాంకకు తోడుగా సచిన్ పైలట్ కలిస్తే కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెసులోనూ యువరక్తం ఉరకలేత్తడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఈ పరిణామాలను ఆ పార్టీలోని సీనియర్లు ఏమేరకు స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే..!