తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?

తమ్మినేని సీతారాం ఏపీ స్పీకర్ గా అందరిచేత అధ్యక్షా అని పిలిపించుకుంటున్నా.. ఆయన మనసంతా మంత్రి పదవీపై ఉందనే టాక్ తరుచూ విన్పిస్తుంది. ఏడు పదుల వయస్సులో మంత్రి పదవీ చేపట్టి రాజకీయాల్లో నుంచి రిటైర్ కావాలని తమ్మినేని భావిస్తున్నారట.ఈ కారణంగానే ఆయన స్పీకర్ పదవీలో ఉన్నప్పటికీ వైసీపీ నేతల మాదిరిగానే ప్రతిపక్ష పార్టీలపై విరుచుపడేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూనే.. వీలైనప్పుడల్లా జగన్ ను ఆకాశానికేత్తేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ […]

Written By: Neelambaram, Updated On : August 12, 2020 5:30 pm
Follow us on


తమ్మినేని సీతారాం ఏపీ స్పీకర్ గా అందరిచేత అధ్యక్షా అని పిలిపించుకుంటున్నా.. ఆయన మనసంతా మంత్రి పదవీపై ఉందనే టాక్ తరుచూ విన్పిస్తుంది. ఏడు పదుల వయస్సులో మంత్రి పదవీ చేపట్టి రాజకీయాల్లో నుంచి రిటైర్ కావాలని తమ్మినేని భావిస్తున్నారట.ఈ కారణంగానే ఆయన స్పీకర్ పదవీలో ఉన్నప్పటికీ వైసీపీ నేతల మాదిరిగానే ప్రతిపక్ష పార్టీలపై విరుచుపడేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూనే.. వీలైనప్పుడల్లా జగన్ ను ఆకాశానికేత్తేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ కు తొలి నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా తమ్మినేని సైలంటవడంపై ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

తమ్మినేని సీతారం స్పీకర్ గా కొనసాగుతున్నా ఆయనలోని రాజకీయ నాయకుడు మాత్రం ఆయనను స్థిమితంగా ఉంచలేకపోతుంది. దీంతో ఆయన జగన్ క్యాబినెట్లో చోటు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. తనకు అవకాశం వస్తే మంత్రి కావాలని ఆశపడ్డారు. అయితే ఇటీవల జగన్ క్యాబినెట్లో రెండు సీట్లు ఖాళీ అవగా ఆయనకు మంత్రి పదవీ దక్కుతుందని భావించారు. మంత్రి పదవీ కోసం ఆయన సతీసమేతంగా సీఎం జగన్ ఇంటి వెళ్లి కలిశారు. దీంతో ఆయనకు మంత్రి పదవీ దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా సీఎం జగన్ తమ్మినేనికి గట్టి షాకిచ్చారు.

తొలి నుంచి జగన్ కు మద్దతు ఇస్తున్న తమ్మినేని సీతారంని కాదని సీఎం జగన్ ఆయన కంటే చాలా జూనియర్ అయిన సీదర్ అప్పలరాజుకు మంత్రిపదవి ఇచ్చారు. ధర్మాన సోదరులకు సన్నిహితంగా ఉండే అప్పరాజుకు మంత్రి పదవీ ఇవ్వడంతో జిల్లాలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన భావిస్తున్నారట. అంతేకాకుండా తన సామాజిక వర్గంలో, తన జిల్లా వరకు వచ్చిన మంత్రి పదవీ తాను చేజిక్కించు లేకపోయాననే బాధలో తమ్మినేని ఉన్నారట. దీంతో ఆయన ప్రస్తుతం సైలంట్ అయ్యారనే టాక్ విన్పిస్తుంది.

Also Read: “పోలవరం కూలిపోయిందా…?” ఎంత దురదృష్టకరం….మరిప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి?

ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన కుమారుడు తమ్మినేని నాగ్ చిరంజీవిని వచ్చే ఎన్నికల బరిలో నిలిపేందుకు యత్నిస్తున్నారు. నాగ్ చిరంజీవి ప్రస్తుతం ఆముదాలవలస వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. తమ్మినేని మంత్రి పదవీ దక్కితే జిల్లాలో తన పట్టును మరింత పెంచుకొని తన తనయుడికి మార్గం సుగమం చేయాలని భావించారు. అయితే అనుహ్యంగా ఆయనకే వైసీపీ చెక్ పడుతుండటంతో ఆయన కలత చెందారనే టాక్ విన్పిస్తుంది.

గతంలో మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే రచ్చ రచ్చ చేసిన తమ్మినేని ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారు. తనకు మంత్రి పదవీ ఇవ్వకపోడంతోనే ఆయన అలక బూనినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం చేసినా ఆయన కనీసం ఒక్క మాట మాట్లాడలేదని కామెంట్లు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీఎం జగన్ ఎలా కూల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.