KCR Rythu Bandhu: తెలంగాణలో రైతుల కోసం రైతుబంధు అందజేస్తోంది. ప్రతి సంవత్సరం పెట్టుబడి కోసం రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకం రైతుబంధు. దీంతో రాష్ర్టంలో ఉన్న రైతాంగానికి సాయపడేందుకు తీసుకొచ్చిన పథకంగా ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదంతా కేసీఆర్ ఇంటి నుంచి ఇస్తున్న డబ్బు కాదు. ప్రజాధనం. ప్రజల సొమ్మును ప్రజలకే పంచుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకంపై కేసీఆర్ కు పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
రైతుబంధు చిన్న, సన్నకారు రైతులతో పాటు భూస్వాములకు కూడా అందుతోంది. దీంతో చిన్న రైతులకంటే బడా భూస్వాములకే ప్రయోజనాలు ఎక్కువగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతుబంధు విషయంలో ప్రభుత్వం ఉన్న వారికే ప్రయోజనం కలిగిస్తోందని చెబుతున్నారు. కానీ కౌలు రైతులను మాత్రం విస్మరించారు. వారికి ఏ రకమైన ప్రయోజనాలు దక్కడం లేదు.
ఇదే కోణంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా లబ్ధి పొందాలని దళితబంధు పేరుతో పథకం తీసుకొచ్చినా దాని అమలు మాత్రం మరచిపోయారు. దీంతో రాష్ర్టమంతటా విస్తరిస్తామన్న కేసీఆర్ హామీ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో దళితులకు నిరాశే ఎదురవుతోంది. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ భవిష్యత్ లో ఎలా వ్యవహరిస్తారనే దానిపైనే అనుమానాలు వస్తున్నాయి.
Also Read: Telangana cabinet expansion: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో ఆ ముగ్గురు?
రాష్ర్టంలో వివిధ పథకాల పేరుతో కేసీఆర్ ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలు తెచ్చినా వాటి ప్రయోజనం మాత్రం కొందరికే అందుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని విజయతీరాలకు చేర్చాలని మరిన్ని పథకాల రూపకల్పనకు నిర్ణయించినట్లు చెబుతున్నారు.