Ticket prices issue: ఏపీలో మూవీ టికెట్ల విషయంలో హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మూవీ టికెట్లను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35ను రద్దు చేస్తూ మొన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం విదితమే. కాగా ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే ఈరోజు ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఇరువురి వాదనలు విన్నది. సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు జీవో నెం.35ను తెచ్చామని ప్రభుత్వం ధర్మసనానికి తెలిపింది.
అయితే ఈ రోజు ఏదో ఒక తీర్పు వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ అలా జరగలేదు. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వివరణ ఇస్తూ విచారణ వెంటనే జరపాల్సిందిగా కోరగా.. ఈ రోజు మొదటి కేసుగా దీన్నే విచారించింది ధర్మాసనం. రేపు పుష్ప మూవీ రిలీజ్ ఉన్నందున విచారణ లేట్ అయితే టికెట్లు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారని అడ్వకేట్ జనరల్ ఇలా త్వరగా విచారణ జరపాలని కోరారు. కానీ ప్రభుత్వ ఆరాటం పనిచేయలేదు.
కానీ తీర్పు సోమవారానికి వాయిదా వేయడంతో పాత పద్ధతిలోనే రేపు రిలీజ్ అవుతున్న పుష్ప మూవీ టికెట్లను అమ్ముకునేందుకు అవకాశం కలిగింది. ఇందుకోసమే డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేస్తున్నారు. కాగా థియేటర్ల ఓనర్లు టికెట్ రేట్లను గనక పాత పద్ధతిలో పెంచితే మాత్రం అందుకు సంబంధించిన పూర్తి వివరాలను జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని ఆదేశించింది. ఇక వాస్తవాలను పరిశీలించి ధరల మీద జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
Also Read: Sumanth: ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !
దీంతో పుష్ప టీమ్‌కు మంచి అవకాశం దొరికింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు పుష్ప డిస్ట్రిబ్యూటర్లకు మంచి ఛాన్స్ దొరికింది. కాగా ఈ చిక్కు నుంచి పుష్ప టీమ్ తప్పించుకున్నా ఆ తర్వాత రిలీజ్ అవుతున్న శ్యాంసింగరాయ్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తో పాటు భీమ్లానాయక్ లాంటి పెద్ద సినిమాల మీద తీర్పు ఎఫెక్ట్ పడుతుంది. ఆ మూవీలు రిలీజ్ అయ్యేలోపు ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పలేం. అంటే ఈ సినిమాల భవిష్యత్ హైకోర్టు తీర్పు మీదే ఆధారపడి ఉన్నాయి.
Also Read: Chiranjeevi: చిరుకి ఏమైంది ? వారికెలా ఛాన్స్ ఇస్తున్నాడు ?