https://oktelugu.com/

ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !

Sumanth: కొందరికి పుట్టుకతోనే అవకాశాలు వస్తాయి. అయితే, పెరిగి పెద్ద అయ్యాక కూడా, వాళ్ళు ఆ అవకాశాలను అందిపుచ్చు కోలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వారసులకు బోలెడు ఛాన్స్ లు వస్తాయి. అయినా ఎందుకో ఆ ఛాన్స్ లను కొందరు వాడుకోలేరు. ఉదాహరణకు అక్కినేని హీరో సుమంత్ విషయానికి వద్దాం. తాతయ్య ఏఎన్నార్ హీరో కాబట్టి, సహజ సిద్ధంగా హీరో అయ్యే అవకాశం వచ్చింది. అయితే, సుమంత్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మొదట్లో చేసిన సినిమాలు […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 03:42 PM IST
    Follow us on

    Sumanth: కొందరికి పుట్టుకతోనే అవకాశాలు వస్తాయి. అయితే, పెరిగి పెద్ద అయ్యాక కూడా, వాళ్ళు ఆ అవకాశాలను అందిపుచ్చు కోలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వారసులకు బోలెడు ఛాన్స్ లు వస్తాయి. అయినా ఎందుకో ఆ ఛాన్స్ లను కొందరు వాడుకోలేరు. ఉదాహరణకు అక్కినేని హీరో సుమంత్ విషయానికి వద్దాం. తాతయ్య ఏఎన్నార్ హీరో కాబట్టి, సహజ సిద్ధంగా హీరో అయ్యే అవకాశం వచ్చింది. అయితే, సుమంత్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

    Sumanth

    మొదట్లో చేసిన సినిమాలు ప్లాప్ లు అయ్యాయి, అలాగే కథల ఎంపిక కూడా కరెక్ట్ గా లేదు. పైగా నటన కోసం పెద్దగా కష్టడుతున్నట్లు తెర మీద ఎప్పుడు సుమంత్ కనిపించలేదు. ఈ మాత్రం నటన చాలు అన్న దగ్గరే ఉండిపోయాడు. అదేవిధంగా తొలిరోజుల్లో మేనమామ నాగార్జునను అనుకరించేవాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల వరకూ ఏఎన్నార్ ను అనుకరించేవాడు.

    దాంతో నటన కూడా కాపీ చేస్తున్నాడు అనే అపవాదు వచ్చింది. ఇక అప్పటికే, వారసత్వ రుద్దుడు అనేది మంచిది కాదు అని కొన్ని గొంతుల వాయిస్ వినిపిస్తోన్న సమయం అది. పైగా అక్కినేని కుటుంబం సినిమాలను నిర్మించే విషయంలో చాలా తెలివితో ఉంటుంది. ఒక సినిమా లేదా రెండు సినిమాలు మాత్రమే సపోర్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

    Also Read: Pushpa: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !

    దాంతో సుమంత్ కి వేరే నిర్మాతల అవసరం పడింది. కానీ, అప్పటికి సుమంత్ కు మార్కెట్ ఏమి క్రియేట్ అవ్వలేదు. పైగా హీరోగా కూడా సుమంత్ గొప్పగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక సొంత డబ్బు ఖర్చు పెట్టి హీరో గా నిలదొక్కుకోవాలనే ఆలోచన సుమంత్ ఎక్కువ కాలం చేయలేకపోయాడు. దాంతో హీరోగా ఎక్కువ సినిమాలు చేయాల్సిన టైంలో చేయలేక పోయాడు. ఆ రకంగా రెగ్యులర్ హీరో కాలేకపోయాడు. మొత్తమ్మీద సుమంత్ ఫెయిల్యూర్ కి మెయిన్ కారణం సుమంతే.

    Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !

    Tags