https://oktelugu.com/

Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana: ‘జనగణమన’తో నేలకు దూకుతున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో మరో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. పూరి జగన్నాథ్.. తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’ను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘జేజీఎమ్’ పేరుతో టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ వ్యూ అండ్ కలర్ టోన్ అండ్ మూవీ కాన్సెప్ట్ తాలూకు విజువల్ సెన్స్ బాగున్నాయి. ఇక […]

Written By:
  • Shiva
  • , Updated On : March 29, 2022 / 04:03 PM IST
    Follow us on

    Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో మరో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. పూరి జగన్నాథ్.. తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’ను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘జేజీఎమ్’ పేరుతో టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ వ్యూ అండ్ కలర్ టోన్ అండ్ మూవీ కాన్సెప్ట్ తాలూకు విజువల్ సెన్స్ బాగున్నాయి. ఇక 2023 ఆగస్టు 23న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

    Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana

    కాగా భయంకరమైన యుద్ధ వాతావరణంలో శత్రువులను అంతమొందించేందుకు నింగి నుంచి భారత సైనికులు నేలకు దూకుతున్న దృశ్యాలతో తొలిపోస్టర్ను డిజైన్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. విజయ్ – పూరి ‘లైగర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే ‘జనగణమన’ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.

    Also Read: Bigg Boss Non Stop OTT Telugu: బిగ్ బాస్: మాటలతోనే తూటాల్లా పేలిపోయారు

    గతంలో పూరీ జనగణమన పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ హీరోగా నటించాల్సి ఉంది. కానీ ముందుకు పోలేదు. ఇప్పుడు అదే సినిమాను పూరీ, విజయ్‌తో చేస్తున్నాడు. నిజానికి విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. మరో పక్క కరోనా ఒకటి. ఏది అయితే ఏం “లైగర్” సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది.

    అలాగే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాలేదు. పూరి ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కాగా విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు.

    Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana

    అలాగే పూరితో కూడా విజయ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే, పూరి – విజయ్ దేవరకొండ కలయిక మరోసారి కుదిరింది. ఈ సినిమాకి కమిట్ అవ్వకముందు ‘లైగర్’ రఫ్ వెర్షన్ ను విజయ్ దేవరకొండ చూశాడట. పూరి సినిమాని తీసిన విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉందట. అందుకే.. విజయ్, పూరితో వెంటనే మరో సినిమా కమిట్ అయ్యాడు.

    Recommended Video:

    Tags