Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. రష్యా తీరును అందరు ఎండగడుతున్నారు. దీంతో ఏకాకిగా మారిపోతోంది. అన్ని వేదికల మీద రష్యా విధానాన్ని కడిగేస్తున్నాయి. నాటో, ఈయూ, అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా అన్ని దేశాలు రష్యా వైఖరిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రష్యా వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది,.

ఈ నేపథ్యంలో అంతర్జాయంగా వస్తున్న డిమాండ్లతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడానికి ప్రభుత్వం రెడీ అయిన నేపథ్యంలో మిగతా వాటిపై కూడా ప్రభావం చూపనుందని తెలుస్తోంది. దీంతో పెరుగుతున్న ధరలతో రష్యాతో పాటు దాని ఆధారపడే అన్ని దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి రానుంది.

రష్యా వైఖరిని విమర్శించడంలో చైనా మాత్రం ఆచితూచి అడుగేస్తోంది. వ్యక్తిగతంగా వ్యతిరేకించకున్నా సభల్లో మాత్రం రష్యాకు మద్దతు తెలపడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన వీటో తీర్మానంపై తన వైఖరి తెలియజేయడానికి ముందుకు రాలేదు. దీంతో రష్యా దుందుడుకు చర్యలను ఖండిస్తున్నా లెక్క చేయడం లేదు. కానీ రష్యా వైఖరిని మాత్రం ఖండిస్తున్నారు.
Also Read: మెగా ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీకి ఉన్న తేడా ఇదే!
దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూయిడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరగనున్నాయి. దీని ప్రభావం ఇండియా మీద కూడా పడనుందని తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఎవరు చేసిన పనికి ఎవరో బాధ్యులు కావాల్సిన పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని అంతా ఖండిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రష్యా చేసిన తప్పులకు మొత్తం ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అయినా రష్యా మాత్రం మొండి వైఖరి వీడటం లేదు. ఉక్రెయిన్ ను సర్వనాశనం చేసేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మానవాళి మరింత ఆందోళన చెందుతోంది.