Ashada Maasam: ఆషాఢ మాసంలో పెళ్లయిన కొత్త జంట మధ్య ఎడం ఎందుకు పాటిస్తారో తెలుసా?

Ashada Maasam:  ఆషాఢ మాసం.. అనగానే మంచిరోజులు మాయమవుతాయి.. ఈ మాసంలో ఏ పని మొదలు పెట్టకూడదు.. అని అంటుంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రకారం ఆషాఢ మాసం ఎలా ప్రారంభమవుతుంది..? ఎలా ఎండ్ అవుతుందో అవగాహన అవసరమంటున్నారు కొందరు పండితులు. కొత్త జంటను వీడదీసే ఈ మాసంలో చెడు కంటే ఎక్కువగా మంచే జరుగుతుందని అంటుంటారు. అయితే ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు..? ఈ మాసంలో చేస్తే నష్టపోతామని ఎందుకు భావిస్తారు..? కొత్త జంటను ఎందుకు […]

Written By: NARESH, Updated On : April 2, 2022 5:38 pm
Follow us on

Ashada Maasam:  ఆషాఢ మాసం.. అనగానే మంచిరోజులు మాయమవుతాయి.. ఈ మాసంలో ఏ పని మొదలు పెట్టకూడదు.. అని అంటుంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రకారం ఆషాఢ మాసం ఎలా ప్రారంభమవుతుంది..? ఎలా ఎండ్ అవుతుందో అవగాహన అవసరమంటున్నారు కొందరు పండితులు. కొత్త జంటను వీడదీసే ఈ మాసంలో చెడు కంటే ఎక్కువగా మంచే జరుగుతుందని అంటుంటారు. అయితే ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు..? ఈ మాసంలో చేస్తే నష్టపోతామని ఎందుకు భావిస్తారు..? కొత్త జంటను ఎందుకు దూరంగా పెడుతారన్న దానిపై స్పెషల్ ఫోకస్..

చంద్రుడు ఉత్తరాషాడ నక్షత్రం యందు ఉండడం వల్ల ఈ మాసాన్ని ఆషాఢం అంటారు. ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశి నుంచి ధనుస్సు రాశి చివరి వరకు అక్కడే ఉంటాడు. ఆషాడ మాసంలోనే శుక్ల విధియ నాడు పూరిజగన్నాథ రథయాత్ర ఉంటుంది. ఆరోజున సుభద్ర బల భద్రుడితో కూడిన జగన్నాథుడిని రథంపై ఊరేగిస్తారు. తెలంగాణలో బోనాల పండుగ వచ్చేది ఈ మాసంలోనే.

ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు. ఆషాఢ మాసం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణు శయనంతో నాలుగు మాసాల్లో తేజం తగ్గుతుంది. దీని వల్ల ఒక్కోసారి శూన్యమాసం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శూన్య మాసంలో శుభకార్యాలు చేయరు. ఇక శుక్లపక్ష ఏకాదశి రోజున హిందువులు పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. ఆషాఢ అమావాస్య రోజుల దీపం వెలిగిస్తారు. ఆరోజు సాయంత్రం ఇంటికి నలువైపులా పెట్టడం ఫలప్రదమని భావిస్తారు.

ఈసారి ఆషాఢ మాసం జూలై 10 నుంచి ఆగస్టు 8 వరకు వచ్చింది. ఈ మాసానికి సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ మాసం కేవలం పూజలకే పరిమితం. శుభకార్యాలు జరగకుండా చూసుకుంటారు.

ముఖ్యంగా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లి అయిన కోడలు అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకుంటుంది. అత్త ముఖం కోడలు చూడవద్దన్న సంప్రదాయం ఉంది. నెలరోజులు పెళ్లైన కోడలు అత్తవారి ఇంటిలో ఉండకుండా పుట్టింటికి చేరుతుంది. వీలైతే భర్తను తీసుకెళుతుంది. లేదంటే ఇద్దరూ కలిసి సిటీలో ఉంటుంటారు. ఈ నెల మొత్తం అత్తా కోడలు దూరంగా ఉంటారు. భర్తతోనూ కొత్త కోడలు కలవవద్దన్న  నియమం పాటిస్తారు.

సాధారణంగా జూలై నెల ఆషాఢమాసంలో ఎక్కువగా వ్యవసాయ పనులు ఉంటాయి. ఈ పనుల్లో కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు కుదరదు కనుక పూర్వకాలంలో పెద్దలు ఇలా కొత్తగా పెళ్లైన జంటను దూరంగా ఉండాలని చెప్పారని సమాచారం. ఇక భార్యపై మోజుతో భర్త వ్యవసాయ పనులు చేయడని.. ఈ మాసంలో భార్యను పుట్టింటికి పంపేలా ఆషాఢమాసాన్ని క్రియేట్ చేశారని చెబుతారు.

Also Read: First Night: అక్కడ పిల్లతోపాటు.. తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్లాల్సిందే..!

ఇక మరో వాదన కూడా ఉంది. అషాఢమాసంలో అమ్మాయి గర్భం దాలిస్తే మంచిది కాదంటారు. ఆ నెలలో కలుషితమైన నీరు.. వ్యాధులు ప్రబలుతాయి. అంతేకాకుండా అషాఢంలో గర్భం దాలిస్తే ఎండలు ఎక్కువగా ఉండే మే నెలలో డెలివరీ జరుగుతుంది. విపరీతమైన ఎండలు ఉండడం వల్ల పుట్టే బిడ్డకు, తల్లికి అష్టకష్టాలు తప్పవు. అందుకే కొత్తగా పెళ్లైన జంటలను ఈ ఆషాఢమాసం పేరుతో నెలరోజులు దూరం ఉంచుతారట.. దీనివల్ల వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని ఈ నియమం పెట్టారని తెలిసింది.

Also Read: Kartika Masam: దీపాలను వెలిగించడంలో ఏ నియమాలు ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలతో?