BJP Strategy To Attract Farmers: తెలంగాణలో బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే రెండు పార్టీల్లో విభేదాలు ముదిరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బీజేపీని టార్గెట్ చేసుకుని కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇందుకు గాను తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సీఎంలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అప్పుడే కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పలువురిని కలుస్తూ తమ ఉద్దేశాలు వివరిస్తూ దేశాన్ని రక్షించాలని పిలుపునిస్తున్నారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు చూస్తూ ఊరుకోబోమని అడ్డుకుంటామని ఉపన్యాసాలు ఇస్తున్నారు.
దీంతో కేసీఆర్ పాత్రపై అందరికి అనుమానాలున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. కానీ కేసీఆర్ కు వీరంతా కలిసి వస్తారా అనేదే ప్రశ్న. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి కాల్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వంతు అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
అయినా కేసీఆర్ మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ వ్యూహం పూర్తిగా మారిపోయింది. బీజేపీని రాష్ట్రంలో ఎదురు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని చెబుతున్నారు దీంతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని బీజేపీ కూడా యోచిస్తోంది.
Also Read: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎగబడుతున్న జనాలు.. నిముషానికి 1000 క్లియర్
తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నా ప్రస్తుతం కౌలు రైతుల సమస్యను తెరమీదకు తెస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబందు, రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం కౌలు రైతుల ప్రయోజనం కోసం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇరుకున పడుతుందని తెలుస్తోంది. ఇదే నినాదంతో ముందుకు వెళ్లి టీఆర్ఎస్ కు సైతం ఓటు బ్యాంకును దూరం చేయాలని ప్లాన్ వేస్తోంది.
దీంతో తెలంగాణలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇదే వ్యూహంతో బీజేపీ టీఆర్ఎస్ ను డైలమాలో పడేసి ఓట్లు సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు గాను పటిష్ట ప్రణాళిక తయారు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: అత్యంత వేడిగాలులు.. భారీ వరదలు.. హైదరాబాద్ కు ఇది హెచ్చరికే!