https://oktelugu.com/

Russia Ukraine War: ఉక్రెయిన్ లో ప్రజల ఊచకోత.. రష్యా దారుణాలు..

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా సైనికుల దాష్టీకాలకు దిమ్మ తిరిగిపోతోంది. అమానవీయ ఘటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎక్కడ మహిళలు కనబడినా వారిపై అత్యాచారం చేస్తూ హత్యలు చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్ లో రష్యా సైనికుల దమనకాండ చూస్తుంటే ఆందోళన నెలకొంటోంది. ఉక్రెయిన్ లో వెలుగు చూస్తున్న దాష్టీకాలతో కీవ్ పరిసర ప్రాంతాల్లో 410 మృతదేహాలు గుర్తించారు. రష్యా సైనికులు ఇంటింటికి వెళ్లి ప్రజలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. మహిళలపై […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 5, 2022 9:31 am
    Follow us on

    Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా సైనికుల దాష్టీకాలకు దిమ్మ తిరిగిపోతోంది. అమానవీయ ఘటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎక్కడ మహిళలు కనబడినా వారిపై అత్యాచారం చేస్తూ హత్యలు చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్ లో రష్యా సైనికుల దమనకాండ చూస్తుంటే ఆందోళన నెలకొంటోంది. ఉక్రెయిన్ లో వెలుగు చూస్తున్న దాష్టీకాలతో కీవ్ పరిసర ప్రాంతాల్లో 410 మృతదేహాలు గుర్తించారు.

    Russia Ukraine War

    రష్యా సైనికులు ఇంటింటికి వెళ్లి ప్రజలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. మహిళలపై లైంగికదాడులు చేసి తరువాత హత్యలకు పాల్పడుతున్నారు. నిరాయుధులపై కాల్పులు జరుపుతూ ప్రజలను అంతమొందిస్తున్నారు. దీంతో రష్యా సైనికుల దుశ్చర్యలను ఖండిస్తున్నారు. ఈ మేరకు మొతిఝిన్ నగర మేయర్, ఆమె భర్త, కుమారుడిని రష్యా సేనలు హత్య చేసి మృతదేహాలను గొయ్యిలో పడేసినట్లు తెలిసింది.

    Also Read: Telangana TRS Leaders Joins BJP: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలు.. ఏం జరుగుతోంది?

    రష్యా సైనికుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రజల పట్ల వారు అనుసరిస్తున్న వైఖరిపై అందరిలో ఆగ్రహం వస్తోంది. నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేయడం ఆందోళన కలిగిస్తోంది. సైనిక దారుణాలపై అంతర్జాతీయ కమిషన్ ద్వారా విచారణ జరిపించలని అనేక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. డెన్మార్క్, పారిస్, జపాన్ సహా పలు దేశాలు రష్యాపై ధ్వజమెత్తుతున్నాయి. ప్రజల ఊచకోతను ఆక్షేపిస్తున్నాయి. యుద్ధం చేయాల్సింది పోయి ప్రజలను భయాందోళనలకు గురిచేసే దుశ్చర్యలకు పాల్పడటం మంచిది కాదని సూచిస్తున్నాయి.

    Russia Ukraine War

    రష్యా చేస్తున్న దమనకాండను ఉక్రెయిన్ అధ్యక్షుడుజెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండిస్తున్నారు. రష్యా సేనలు దాడులకు తెగబడటం క్షమించరాని నేరంగా చెబుతున్నారు. రాక్షసంగా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుతిన్ ను యుద్ధ నేరాల కింద విచారించాలని అభిప్రాయపడుతున్నారు. యుద్ధ విరమణకు సహకరించాల్సింది పోయి యుద్ధానికి కాలు దువ్వడంపై ఆక్షేపించారు. ఇంకా భవిష్యత్ లో మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని బెంగ పడుతున్నారు.

    Also Read:Jagan Shocks MLA Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్

    Tags