Homeఎంటర్టైన్మెంట్Pub Drugs Case: ఏ3గా అర్జున్ వీరమాచినేని.. ఈయన నందమూరి ఫ్యామిలీ అని తెలుసా?

Pub Drugs Case: ఏ3గా అర్జున్ వీరమాచినేని.. ఈయన నందమూరి ఫ్యామిలీ అని తెలుసా?

Pub Drugs Case: హైదరాబాద్ లో ఇటీవల సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు కేవలం అనుమతికి మించి పబ్ నిర్వహించారనే ఆరోపణలతో పాటు డ్రగ్స్ వినియోగించారని అనుమానించారు. కానీ ఈ పబ్ లో మైనర్లకు కూడా డ్రగ్స్ విక్రయించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా పబ్ నిర్వాహాకుల్లో ఒకరైన అర్జున్ వీరమాచినేని..నందమూరి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. నందమూరి కొడుకు రామకృష్ణ అల్లుడే అర్జున్ వీరమాచినేని అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే నలుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యక్తుల గురించి గాలిస్తున్నారు. మరోవైపు పబ్ లైసెన్స్ ను సస్పెండ్ చేశారు.

Pub Drugs Case
Pub Drugs Case

24 గంటలు అందుబాటులో ఉంటుందని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించారు. దీంతో ఇందులో కొంతమంది ఎంజాయ్ చేయడానికి వచ్చినా.. మరికొందరు మాత్రం డ్రగ్స్ వినియోగానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు రైడ్ చేసిన సమయంలో పబ్లోని టేబుళ్లపై కొకైన్ ప్యాకెట్లు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఐదు ప్యాకెట్లలో 4.64 గ్రాముల ఉంటుందంటున్నారు. గతంలో కూడా ఇక్కడ డ్రగ్స్ వినియోగం జరిగిందని పోలీసులు అనుమానిస్తు్నారు. నమ్మకస్తులతో వాట్సాప్ ద్వారా గ్రూపును ఏర్పాటు చేసుకొని కస్టమర్లను ఆకర్షించారని తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న అనిల్ కుమార్ ఫోన్ ను పరిశీలిస్తే ఈ విషయం బయడపడే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ లో ప్రజల ఊచకోత.. రష్యా దారుణాలు..

అనిల్ కుమార్ ను చంచల్ గూడ జైలుకు తరలించగా.. అభిషేక్ కస్టడి కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పబ్ కు డ్రగ్స్ తెచ్చిందెవరు..? ఎవరు సరపరా చేస్తున్నారు..? అనే కోణాల్లో విచారిస్తున్నారు. ఇక పబ్ పై దాడులు జరిగిన సమయంలో టేబుళ్లపై లభించిన ప్యాకెట్లు, టూత్ పీక్ లను సీజ్ చేశామని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. పోరెన్సిక్ నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని అన్నారు. పోలీసుల దాడి సమయంలో ఆరు పార్టీలు జరుగుతున్నాయని, ఆయా పార్టీలు వీరే నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున మొత్తం 148 మందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో తేల్చనున్నారు.

Pub Drugs Case
Pub Drugs Case

ఈ పబ్ లో పోలీసులకు చిక్కిన వారిలో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కూడా మద్యం సేవించినట్లు సమాచారం. చట్ట ప్రకారం మైనర్లకు మద్యం సరఫరా చేయడం నేరం. గతంలోనూ ఎక్సైజ్ శాఖ నగరంలోని పలు పబ్ లు, బార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుమానాలుంటే ఆధార్, ఇతర వయసు నిర్దారణ చేసుకోవాలని సూచించింది. అయితే నిబంధననలకు వ్యతిరేకంగా నిర్వహించిన పుడ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ సస్పెండ్ చేసింది. పబ్ లో డ్రగ్స్ వినియోగించడంతో పాటు బయటి వ్యక్తులకు కూడా సరఫరా చేశారనే కారణాలు తెలపనుంది.

ఇదిలా ఉండగా పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అనిల్, అభిషేక్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇక ఈవెంట్ మేనేజర్ కునాల్, డీజే శశిధర్ రావుల పాత్రపై కూడా అనుమానాలున్నట్లు పోలీసుల తెలిపారు. పబ్ నిర్వాహకుల్లో మరో ఇద్దరు అర్జున్ వీరమాచినేని, కిరణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నారు. అర్జున్ వీరచినేని నందమూరి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది.

Also Read:Jagan Shocks MLA Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] IMDB: ‘ఆర్ఆర్ఆర్’ సృష్టిస్తున్న రికార్డుల దెబ్బకు భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, తాజాగా ఆర్ఆర్ఆర్ కు మరో అద్భుతమైన గౌరవం దక్కింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ (ఐఎండీబీ – IMDB)లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ లిస్ట్ లో ఉన్న ప్రపంచవ్యాప్త టాప్ 5 సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఒకటిగా నిలిచింది. […]

Comments are closed.

Exit mobile version