Homeఅంతర్జాతీయంRussia-Ukraine War- India: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: భారత్ లాభ పడింది ఇలా

Russia-Ukraine War- India: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: భారత్ లాభ పడింది ఇలా

Russia-Ukraine War- India
Russia-Ukraine War- India

Russia-Ukraine War- India: పోరు నష్టం.. పోరు లాభం..అన్నట్టుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ లాభ పడింది. యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేదానికి అనుకూలంగా మారిపోయాయి. తూర్పు, పశ్చిమ, ఆసియా, ఇండో, పసిఫిక్ భౌగోళిక రాజకీయ అంశాలలో భారతదేశం కీలకంగా మారింది. దీంతో భారత్ తో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అటు అమెరికా నేతృత్వ కూటమి, ఇటు చైనా, రష్యా కూటమి గుర్తించాయి. ఫలితంగా అమెరికాతో వాణిజ్య, సైనిక సంబంధాలను భారత్ పెంపొందించుకుంటూనే, మరోవైపు రష్యా తోనూ మిలటరీ సంబంధాలను కొనసాగించగలుగుతోంది. భారతదేశానికి కావలసిన మిలటరీ ఆయుధ సంపత్తిని, రెండు కూటమిల నుంచి సమకూర్చుకోవడంతోపాటు ముడి చమురునూ రష్యా నుంచి చౌకగా పొందుతోంది.

ఇప్పుడు ఇరాన్ కూడా రష్యా వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతికి ఇరాన్ లోని నౌకాశ్రయాలనూ వాడుకునేందుకు భారతదేశానికి అవకాశం ఏర్పడింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురును శుద్ధిచేసి ఐరోపా, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది అమెరికా నేతృత్వంలోని దేశాలకు మింగుడు పడకపోయినప్పటికీ, అంతిమంగా దేశ ప్రజల ప్రయోజనాలకే తాము ప్రాధాన్యం ఇస్తామని ఎప్పటికప్పుడు భారత్ స్పష్టం చేస్తోంది. ఈ నెలలో రష్యాపై సమాఖ్య మరికొన్ని ఆంక్షలు అమలు చేయనున్న నేపథ్యంలో ఇంధన మార్కెట్లో భారత్ ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Russia-Ukraine War- India
Russia-Ukraine War- India

ఉక్రెయిన్ పై రష్యా దాడిని భారత్ ఖండించడం లేదని, రష్యా నుంచి చంబరు దిగుమతులు పెంచుకోవడం ద్వారా లాభపడుతోందని ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ దీటుగా తిప్పి కొ డుతున్నారు.. భారత్ ఒక నెలలో కొనుగోలు చేసే ఇంధనాన్ని ఐరోపా ఒక పూటలోనే కొంటుందని ధ్వజమెత్తుతున్నారు. ఇక యుద్ధం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కు మరిన్ని కాంట్రాక్టులు లభిస్తున్నాయి. తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు బ్రిటన్ కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ కు అదనంగా వెయ్యి కోట్ల విలువైన కాంట్రాక్టులను ఇచ్చింది.. గతంలో బ్రిటన్ రష్యా రాకెట్ల ద్వారానే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేది. కానీ, నుంచి ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళేందుకు రష్యా నిరాకరిస్తుంది. దీంతో ఆ కాంట్రాక్టులు ఇస్రోకు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా 36 ఉపగ్రహాలను 2022 అక్టోబర్ 23న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. మిగిలిన 36 ఉపగ్రహాలను వచ్చే నెలలో అంతరిక్షంలోకి పంపించే అవకాశం ఉంది. మొత్తానికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత్ ప్రబల శక్తిగా ఎదిగింది. ఒకప్పుడు అమెరికా ఏమనుకుంటుందో, బ్రిటన్ ఎలాంటి ఆంక్షలు విధిస్తుందో, యూరోపియన్ యూనియన్ ఎలాంటి మాటలు అంటుందో… అని భయపడిన భారత్.. నేడు సందర్భంగా తలెత్తుకొని నిలబడగలిగింది. అందుకే మిగతా దేశాలకు కడుపు మంట..ఇక్కడ ఉన్న సో కాల్డ్ ప్రతిపక్షాలు తక్కువేం కాదు.

 

సామాజిక న్యాయం, సంక్షేమం పేరుతో పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చటం సాధ్యమా ? || CM Jagan || Ok Telugu

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version