Bheemla Nayak Box Office Collection: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్లా?

Bheemla Nayak Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా కొనసాగుతోంది. భీమ్లానాయక్ ఊపు కంటిన్యూ అవుతోంది. ఈ సినిమాతో పవన్ టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు. భీమ్లానాయక్ మూవీకి తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ స్టైల్ యాక్టింగ్ తో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్ బేస్ ను భీమ్లానాయక్ మూవీ మరింత విస్తృతం చేసుకుంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు […]

Written By: NARESH, Updated On : March 3, 2022 11:55 am
Follow us on

Bheemla Nayak Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా కొనసాగుతోంది. భీమ్లానాయక్ ఊపు కంటిన్యూ అవుతోంది. ఈ సినిమాతో పవన్ టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు.

Pawan Kalyan and Rana

భీమ్లానాయక్ మూవీకి తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ స్టైల్ యాక్టింగ్ తో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్ బేస్ ను భీమ్లానాయక్ మూవీ మరింత విస్తృతం చేసుకుంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తున్నాయి.

Also Read:  తన పెళ్లి పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

తాజాగా భీమ్లానాయక్ మూవీ అయితే సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది. అక్కడి అదిరిపోయే రికార్డులను సాధిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘భీమ్లానాయక్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భారత దేశం మొత్తం రూ.9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు మరో 9 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ లెక్కన భీమ్లానాయక్ మూవీ ఈ వారం ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Bheemla Nayak

‘భీమ్లానాయక్’ కు ఏపీ, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. వరుసగా సెలవులు రావడంతో ఈ కలెక్షన్లు దక్కాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం..తొలి వారం కలెక్షన్లు 150 కోట్లు దాటి 200 కోట్లకు చేరువ అయ్యాయయని చెబుతున్నారు. ఇక ఈ వారం బుకింగ్స్ ను చూస్తే ఖచ్చితంగా మూవీ 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఊపు ఈ వారం అంతా కంటిన్యూ అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులను పవన్ బద్దలు కొట్టేస్తాడు. ఓవరాల్ గా 500 కోట్ల కలెక్షన్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Also Read: భీమ్లానాయ‌క్ లో పిచ్చెక్కిస్తున్న త్రివిక్ర‌మ్ డైలాగులు ఇవే.. ఎన్నాళ్ల‌కు గురూజీ..!

Recommended Video:

Tags