Russia Announced War on Ukraine: అనుకున్నట్టే అయ్యింది. అమెరికా, యూరప్ దేశాలతో సన్నిహితంగా ఉంటున్న ఒకప్పటి సోవియట్ దేశం ‘ఉక్రెయిన్’పై రష్యా యుద్ధం ప్రకటించింది. అక్కడి ప్రజల ప్రాణ, ఆస్తులకు ఇక దేవుడే దిక్కుగా మారింది. యుద్ధంతో వచ్చే అనర్థాలు తెలిసి అమెరికా, యూరప్ దేశాలు ఎన్ని ఆంక్షలను రష్యాపై పెట్టినా సమరోత్సాహంతో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా సినిమా షూటింగ్ లకు నిలయంగా.. ప్రకృతి ప్రసాదంగా ఉన్న ఉక్రెయిన్ దేశంపై యుద్ధం ప్రకటించాడు.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ మేరకు యుద్ధాన్ని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. తూర్పు ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరి జోక్యం వద్దని సూచించారు. ఈ ఆపరేషన్ లో ఏ దేశం జోక్యం చేసుకున్నా వారిపై ప్రతీకారం తప్పదంటూ పుతిన్ హెచ్చరించారు.
ఇప్పటికే రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించాయి. ఖార్ కివ్ తదితర నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అంతర్జాతీయ మీడియా విడుదల చేసింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయమని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు
ఉక్రెయిన్ లోకి ఇప్పటికే సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ప్రవేశించారు. ఉక్రెయిన్ సైతం తమ బలగాలతో సిద్ధమైంది. ఉక్రెయిన్ దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమై రష్యాను హెచ్చరించింది. వెంటనే బలగాలను వెనక్కి పంపాలని సూచించింది. ఐరాస సభ్యదేశాలు చర్చలు జరపాలని.. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరింది.
Also Read: రష్యా, ఉక్రెయిన్.. ఎవరి సత్తా ఎంత? సైన్యం బలాబలాలివీ!
-ఉక్రెయిన్ లోనే ‘ఆర్ఆర్ఆర్’, బాహుబలి షూటింగ్స్
రష్యా దేశానికి ఆనుకొని దాని కింద ఉండే ‘ఉక్రెయిన్’ దేశం ప్రకృతి సంపదతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి చెట్లు, అడవులు, మంచు సినిమా లోకేషన్లకు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక చారిత్రక కట్టడాలు కూడా రాజవంశీయుల ఖ్యాతిని ఇనుమడింపచేస్తాయి. అందుకే ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్ ను కూడా ఉక్రెయిన్ లోని ఓ రాజభవనం ముందే షూటింగ్ చేశారు. అంతకుముందు బాహుబలి సినిమాను కూడా ఇక్కడే కొంత భాగం షూటింగ్ చేశారు.
రాజమౌళి ఎక్కువగా తన సినిమాల ఫారెన్ షెడ్యూల్స్ ను ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలే కాదు.. బాలీవుడ్, దక్షిణాది భాషల చిత్రాలు కూడా ఇక్కడి సుందర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాంటి ప్రకృతి సిద్ధ దేశంపై ఇప్పుడు రష్యా యుద్ధం ప్రకటించింది. తమ మాట వినడం లేదని అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి దిగారు. ఇప్పుడక్కడ ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారింది. అందమైన లోకేషన్లు, భవనాలు, సహా అన్నింటికి ముప్పు ఏర్పడింది.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?
Recommended Video: