Marriage After 30 Years: పెండ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో కచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. అయితే ఈ పెండ్లి విషయంలో కాలాన్ని బట్టి చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పటి యువత చాలా వరకు 30ఏండ్ల తర్వాతే పెండ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా 30 తర్వాత చేసుకునే వారికి చాలా సమస్యలు వస్తాయంట. ఎందుకంటే ఆ వయసు దాకా చేసుకోకపోతే వారిలో ఎవరి అభిప్రాయాలకు వారే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారట.

ఇద్దరిలో ప్రాక్టికాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరికి వారే స్వతంత్రంగా ఆలోచిస్తుంటారు. ఇద్దరి మధ్య సర్దుకు పోయే అలవాటు తక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడున్న వాతావరణం, కాలుష్యం, కల్తీ తిండి లాంటి వాటిని పరిశీలించినప్పుడు 30 తర్వాత పెండ్లి చేసుకునే వారిలో ఎక్కువగా సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయంట.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?
ముఖ్యంగా భార్యాభర్తలు అంటేనే ఒకరికి ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోయి జీవితాంతం కలిసి ఉండాలి. కానీ 30ఏండ్లు దాటే దాకా ఒంటరిగా ఉండటం వల్ల వారిలో తమకు నచ్చినట్టు బ్రతికే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ వయసులో పెండ్లి చేసుకుంటే తమ భార్య లేదా భర్త ఆలోచనల కంటే కూడా తమ ఆలోచనలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. దీంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. కొన్ని సార్లు అవే పెద్ద గొడవల్లాగా మారుతుంటాయి.

అదే 25ఏండ్ల వరకు చేసుకునే వారిలో ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఎందుకంటే త్వరగా జంట అయిపోతారు కాబట్టి.. 30 ఏండ్లు వచ్చే సరికి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తారంట. కాబట్టి 30 ఏండ్లలోపు చేసుకున్న వారికి పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు మానసిక, ఆరోగ్య నిపుణులు. మరి మీరు కూడా పెండ్లి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Also Read: తిరుమల వెళ్లే వీఐపీలకు షాకిచ్చిన టీటీడీ..? ఈ గగ్గోలేంటి?