https://oktelugu.com/

ఏపీపై ఆర్‌‌ఎస్‌ఎస్‌ ఫోకస్‌..మతలబు ఏంటి?

ఆర్‌‌ఎస్‌ఎస్‌.. దేశ ప్రజలకు ఈ విభాగం గురించి తెలియనిది కాదు. ఒక విధంగా బీజేపీ దేశాన్ని పాలిస్తున్నా.. నిర్ణయ విధానాలన్నీ ఆర్‌‌ఎస్‌ఎస్‌వనే చెప్పాలి. ఈ ఆరెస్సెస్ వ్యవహారాలన్నీ ఎప్పుడూ గుంభనంగా సాగుతుంటాయి. ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పంజుకోవాలంట అక్కడ ఆర్‌‌ఎస్‌ఎస్‌ పాగా వేయాల్సిందే. ఆరెఎస్‌ఎస్‌ బలమైన పునాది వేసిన చోట ఇక బీజేపీకి తిరుగు ఉండదు. త్రిపుర చూసుకున్నా.. మరెక్కడ చూసినా ఇప్పటివరకు అదే జరిగింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌‌ఎస్‌ఎస్‌ పునాదులు అంత బలంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 12:22 PM IST
    Follow us on


    ఆర్‌‌ఎస్‌ఎస్‌.. దేశ ప్రజలకు ఈ విభాగం గురించి తెలియనిది కాదు. ఒక విధంగా బీజేపీ దేశాన్ని పాలిస్తున్నా.. నిర్ణయ విధానాలన్నీ ఆర్‌‌ఎస్‌ఎస్‌వనే చెప్పాలి. ఈ ఆరెస్సెస్ వ్యవహారాలన్నీ ఎప్పుడూ గుంభనంగా సాగుతుంటాయి. ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పంజుకోవాలంట అక్కడ ఆర్‌‌ఎస్‌ఎస్‌ పాగా వేయాల్సిందే. ఆరెఎస్‌ఎస్‌ బలమైన పునాది వేసిన చోట ఇక బీజేపీకి తిరుగు ఉండదు. త్రిపుర చూసుకున్నా.. మరెక్కడ చూసినా ఇప్పటివరకు అదే జరిగింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌‌ఎస్‌ఎస్‌ పునాదులు అంత బలంగా లేవు.

    Also Read: రూల్స్ అంటే రూల్సే.. కేసీఆర్‌‌ ఆస్తులు సైతం నమోదు

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌‌ఎస్‌ఎస్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇక్కడ ఎదిగిన బీజేపీ నేతలంతా ఆర్‌‌ఎస్‌ఎస్‌ బ్యాంక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన వారే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కూడా ఆర్‌‌ఎస్‌ఎస్‌ కార్యకర్తే. అయితే.. ఏపీలో మాత్రం ఆర్‌‌ఎస్‌ఎస్‌ ఇంకా పాగా వేయలేకపోయింది. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్రంపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది.మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత, విభాగ ప్రచారక్‌ భైఠక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆర్‌‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా వచ్చారు. ఆర్‌‌ఎస్‌ఎస్‌ను విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

    తెలంగాణలో దాదాపుగా ప్రతీ మండలంలో ఆర్‌‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ పాఠశాల ఉంటుంది. కానీ ఏపీలో వాటి సంఖ్య చాలా పరిమితం. ఇప్పుడు.. మూలాల నుంచి ఆర్‌‌ఎస్‌ఎస్‌ను బలపరచాలన్న లక్ష్యంతో మోహన్ భగవత్ దృఢ సంకల్పంతో ఉన్నారు. దేశంలో బీజేపీ ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిది. ఆ పరిస్థితి నుంచి అధికారం దిశగా ఎదగాలనే లక్ష్యాన్ని సాకారం చేయాలని ప్రయత్నిస్తోంది ఆర్‌‌ఎస్‌ఎస్‌. మరి అది ఎంత వరకూ సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి..!

    Also Read: జేసి రెడ్డప్ప పని పడుతున్న జగన్. వ్యాపారాలను దెబ్బతీయడమే టార్గెటా?

    ఇక ఆర్ఎస్ఎస్ వాది అయిన సోము వీర్రాజుకే ఏపీ రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చారు. ఆయన గద్దెనెక్కగానే దూకుడుగా వెళ్తున్నారు.  ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడంతో పార్టీ బలోపేతంపై ఆచితుచి ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో నియమించిన కొత్త కమిటీలోనూ అనుమానాస్పద వ్యక్తులను ఆయన పక్కన పెట్టారు. ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యం ఉన్నవారికి.. తనకు అనుకూలంగా వారికే కమిటీలో ప్రాధాన్యం కల్పించారు. ఏపీ అధ్యక్షుడిగా వీర్రాజు ఉన్నంతకాలం కమలం గూటికి వలస నేతలు చేరడం అంత ఈజీ కాదనే సంకేతాలను శ్రేణుల్లోకి పంపుతున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు సైతం వీర్రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీపై ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫోకస్ చేసినట్టు అర్థమవుతోంది.