https://oktelugu.com/

Mallanna Army: ‘మల్లన్న’ సైన్యంపై గురిపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్?

Mallanna Army: తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే ప్రతిపక్ష పార్టీలన్నీ అలర్ట్ అవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అందరికీ షాకిచ్చారు. దీంతో ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ముందుగానే రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగానే అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న సంగతి అందరికి తెల్సిందే. తీన్మార్ మల్లన్న తొలి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2021 / 11:14 AM IST
    Follow us on

    Mallanna Army: తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే ప్రతిపక్ష పార్టీలన్నీ అలర్ట్ అవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అందరికీ షాకిచ్చారు. దీంతో ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ముందుగానే రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగానే అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతున్నాయి.

    Teenmaar Mallanna

    ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న సంగతి అందరికి తెల్సిందే. తీన్మార్ మల్లన్న తొలి నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఈక్రమంలోనే ఆయనపై పోలీసులు లెక్కకు మించి కేసులు పెట్టారు. అయినప్పటికీ తీన్మార్ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతున్నారు.

    ఈక్రమంలోనే తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక అభిమానగణం ఏర్పడింది. తన సామాజిక వర్గంతోపాటు టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఆయనకు అండగా నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తీన్నార్ మల్లన్న ఇటీవల తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు.

    చివరివరకు రేసులో నిలిచిన మల్ల్నన్న అనూహ్యంగా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను వెలికితీసి నైతిక విజయం సాధించడంలో మల్లన్న విజయం సాధించాడు. ఈక్రమంలోనే మల్లన్న కొత్త పార్టీ పెడుతారని లేదంటే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.

    ఈ పరిణామాలను ఆర్ఎస్ ప్రవీణ్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నినెలల ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. ఆపార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడంతో అతడి వెంట నడిచిన బాహుజన సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మురం చేస్తున్నారు.

    Also Read: ఐఏఎస్ ల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. గొనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

    తీన్మార్ మల్లన్న జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో అతడికి ఒక సామాజిక వర్గం అండగా నిలిచింది. అయితే అతడు బీజేపీలో చేరడంతో వారంతా సైలంటయ్యారు. దీంతో బీఎస్పీ భావజలం కలిగిన మల్లన్న క్యాడర్ ను తనవైపు తిప్పుకునేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓసారి వాళ్లతో ప్రత్యేకంగా సమావేశమై తమతో నడువాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ ఏమేరకు సక్సస్ అవుతారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    Also Read: ఆ సత్తా బీజీపీకే ఉందంటున్న మల్లన్న.. కాంగ్రెస్ మీద ఘాటు కామెంట్స్